https://oktelugu.com/

Telangana School Reopen: తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ ఆరోజు నుంచేనా..?

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం తెలిసిందే. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు చేసిన కృషి ఎంతో ఉంది. విద్యాసంస్థల మూత, సినిమా థియేటర్ల బంద్, బార్లు బంద్ చేయడం వంటి వాటితో లాక్ డౌన్ విధించి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు చేపట్టింది. దీంతో కరోనా మొదటి, రెండో దశలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. మొదటి దశలో వృద్ధులు, […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 13, 2021 / 10:51 AM IST
    Follow us on

    ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం తెలిసిందే. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు చేసిన కృషి ఎంతో ఉంది. విద్యాసంస్థల మూత, సినిమా థియేటర్ల బంద్, బార్లు బంద్ చేయడం వంటి వాటితో లాక్ డౌన్ విధించి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు చేపట్టింది. దీంతో కరోనా మొదటి, రెండో దశలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. మొదటి దశలో వృద్ధులు, రెండో దశలో యువకులు వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినా వైరస్ మాత్రం తన ప్రతాపం తగ్గించలేదు.

    ఈ నేపథ్యంలో రాష్ర్టంలో మూతపడిన విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విడతల వారీగా తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ సిద్ధమవుతోంది. మొదట ఉన్నత తరగతులకు అనుమతి ఇచ్చి తరువాత ప్రాథమిక స్థాయి వారికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి 8వ తరగతి నుంచి పీజీ తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ స్టేట్లలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనాలు చేస్తున్నారు.

    ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు పెరిగాయని చెప్పారు. దీంతో విద్యాసంవత్సరం వృధా కాకుండా కాలేజీలు ప్రారంభించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు.

    ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య 52 వేలు నుంచి 1.90 లక్షలు దాటినట్లు పేర్కొన్నారు. ఇంటర్ విద్యలో సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి సబ్జెక్టు రివైడ్ చేశామన్నారు. సెకెండియర్ తెలుగు, ఫస్టయర్ ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోను మార్పులు చేశామని చెప్పారు. రాష్ర్టంలోని విద్యార్థులందరికి ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించామని తెలిపారు. ఉచిత పుస్తకాలకు 9 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.