https://oktelugu.com/

నాగార్జున కోసం భారీ స్వర్గం సెట్ !

అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ బంగార్రాజు సినిమా వచ్చేవారం స్టార్ట్ కానుంది. కాగా ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ స్వర్గం సెట్ వేశారు. ఈ సెట్ చాలా భారీగా ఉంటుంది. అయినా పెద్ద చిత్రాలకు మాత్రమే సెట్స్ వేసే రవీందర్ సెట్ వేశాడు అంటేనే.. ఆ సెట్ కి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉందని అర్థం. అయితే, బడ్జెట్ విషయంలో చాలా కంట్రోల్ లో ఉండే నాగార్జున (0nagarjuna) ఈ […]

Written By:
  • admin
  • , Updated On : August 13, 2021 / 10:58 AM IST
    Follow us on

    అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ బంగార్రాజు సినిమా వచ్చేవారం స్టార్ట్ కానుంది. కాగా ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ స్వర్గం సెట్ వేశారు. ఈ సెట్ చాలా భారీగా ఉంటుంది. అయినా పెద్ద చిత్రాలకు మాత్రమే సెట్స్ వేసే రవీందర్ సెట్ వేశాడు అంటేనే.. ఆ సెట్ కి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉందని అర్థం.

    అయితే, బడ్జెట్ విషయంలో చాలా కంట్రోల్ లో ఉండే నాగార్జున (0nagarjuna) ఈ సెట్ విషయంలో మాత్రం ఎలాంటి బడ్జెట్ పరిమితులు పెట్టుకోలేదు. మొత్తానికి ‘బంగార్రాజు’ (0bangarraju) కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. ఎలాగూ ‘సోగ్గాడే చిన్ని నాయన’ భారీ విజయం సాధించింది. కాబట్టి, ఆ సినిమా విజయం కారణంగా ఈ సినిమాకి కూడా మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

    అందుకే, ఈ సినిమా బడ్జెట్ విషయంలో నాగార్జున ఎక్కడా వెనుకాడడం లేదు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తోన్నాడు. ‘మనం’ తర్వాత నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. పైగా ఈ సినిమాలో చైతుకి జోడీగా క్రేజీ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

    ఎంతైనా అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కీలకమైనది కాబట్టి, ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కల్యాణ్‌ కృష్ణ కురసాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్. అలాగే, మోనాల్ గజ్జర్ సహా పలువురు ఇతర భామలు కనిపిస్తారని తెలుస్తోంది.