కొవిడ్ మొదటి, రెండో దశల్లో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాణాలు సైతం పిట్టల్లా రాలిపోయాయి. వైరస్ ధాటికి పిల్లలు, పెద్దలు అందరూ బాధితులయ్యారు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కొవిడ్ ప్రభావంతో పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి వైరస్ ను కట్టడి చేసినందున ప్రస్తుతం రాష్ర్టంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో పాఠశాలల ప్రారంభానికి చర్యలు చేపడుతోంది.
సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పాఠశాలలను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ముందు చూపు లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని రాష్ర్ట ప్రభుత్వ తీరుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది మంగళవారం విచారణకు రానుంది. స్కూళ్ల ప్రారంభంపై ఎలాంటి శాస్రీయ విధానాలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పాఠశాలల ప్రారంభంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పెద్దలకు మాత్రమే ఇస్తున్నారు. ఇంతవరకు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత దృష్ట్యా పాఠశాలల ప్రారంభం గురించి ప్రభుత్వం ముందుచూపు పెట్టడం లేదని తెలుస్తోంది. దీంతో పాఠశాలల ప్రారంభం వద్దని పిటిషన్ వేసిన నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభంతో పిల్లల ఆరోగ్యంపై ఆటలాడొద్దని సూచిస్తున్నారు. దీంతో కోర్టు తీర్పు ఆధారంగానే పాఠశాలల ప్రారంభం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.