Megastar’s Acharya: ప్చ్.. రేట్లు పెంచాకే ఆచార్య రాక !

Megastar’s Acharya: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులు అందరూ ఆచార్య(Acharya) ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అలాగే ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ నిత్యం సోషల్ మీడియాలో కామెంట్స్ తో హడావిడి చేస్తున్నారు. అదేంటో ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తున్నా.. మేకర్స్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. అసలు ఆచార్య రాక గురించి మేకర్స్ కు కూడా క్లారిటీ లేదు అనేది టాక్. ఆ మధ్య ఎప్పుడో ఆచార్య నుంచి ఒక […]

Written By: admin, Updated On : August 31, 2021 10:00 am
Follow us on

Megastar’s Acharya: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులు అందరూ ఆచార్య(Acharya) ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అలాగే ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ నిత్యం సోషల్ మీడియాలో కామెంట్స్ తో హడావిడి చేస్తున్నారు. అదేంటో ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తున్నా.. మేకర్స్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. అసలు ఆచార్య రాక గురించి మేకర్స్ కు కూడా క్లారిటీ లేదు అనేది టాక్.

ఆ మధ్య ఎప్పుడో ఆచార్య నుంచి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోతో పాటు మెగాస్టార్ స్టైలిష్ మోషన్ పోస్టర్ ను వదిలారు. ఏది ఏమైనా మెగాస్టార్ లుక్ మాత్రం అదిరిపోయింది. సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. మరి ఆచార్య రిలీజ్ డేట్ ఎందుకు ఇంకా ఫిక్స్ చేయలేదు ? చిత్రబృందంకు కూడా స్పష్టత లేకపోవడానికి కారణం ఏమిటి ?

అసలు “ఆచార్య” టీం ప్లాన్ ఏమిటి ? దసరాకి ఈ సినిమా రాబోతుంది అంటూ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో ఇప్పటికీ టాక్ నడుస్తోంది. కానీ, డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. కాకపోయినా ప్రచారం మాత్రం జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ? మరోపక్క ఆచార్య దసరాకి రిలీజ్ అవుతుందా ? లేదా ? అని ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు.

ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తి అయింది. కాబట్టి.. దసరాకి సినిమాని రిలీజ్ చెయ్యొచ్చు. కానీ, రిలీజ్ డేట్ ప్రకటించక పోవడానికి ఏపీలో థియేటర్స్ సమస్య, టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని చిరు ఫీల్ అవుతున్నారు. కాబట్టి, ముందు ఏపీలో టికెట్ రేట్లు పెరిగేలా చర్యలు తీసుకుని ఆ తర్వాత ఆచార్య రిలీజ్ డేట్ ప్రకటిస్తే బాగుటుంది అని చిరు ప్లాన్.

అందుకే, మెగాస్టార్ ఏపీ సీఎం జగన్ ను కలవడానికి కసరత్తులు చేసున్నారు. కానీ టికెట్ రేట్లు పెంచడానికి జగన్ ఒప్పుకుంటాడా ? డౌటే. ఒకవేళ టికెట్ రేట్లు పెంచకపోతే.. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ను పోస్ట్ ఫోన్ చేస్తూనే ఉంటారా ? ఏది ఏమైనా ఆచార్య టీం మాత్రం టికెట్ రేట్లు పెంచితేనే ఆచార్య రాకకు ముహూర్తం ఫిక్స్ అవుతుంది అన్న మాదిరిగా వ్యవహరిస్తోంది.