దేశంలోనే ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ఎట్టకేలకు 40 ఏళ్ల సహవాసం తర్వాత ఈనాడు దినపత్రిక నుంచి వైదొలిగారు. 2021 ఆగష్టు 30న తాను రాజీనామా చేసినట్లు స్వయంగా ఆయనే సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. శ్రీధర్ ప్రఖ్యాత తెలుగు కార్టూనిస్టు. ఈనాడు దినపత్రిక బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో వైరల్ అయ్యేవి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి. ఆయన కార్టూన్ లలో ఎంత వ్యంగ్యం ఉంటుందో అంతే విషయం కూడా ఉంటుంది. ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ప్రయత్నం చేసాడు. కార్టూనిస్ట్ శ్రీధర్ తన కార్టూన్ల ద్వారా తెలుగువారి హృదయాలలో నిలిచిపోయారు. అతను దాదాపు 40 సంవత్సరాలుగా ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
పాఠకులు ఈనాడు పేపర్ లో వచ్చే వార్తల కోసం కోసం ఎంత అతృతగా ఎదురుచుస్తుంటారో ప్రతిరోజు చోటుచేసుకునే పరిస్థితులపై “ఇదీ సంగతీ” లో వచ్చే శ్రీధర్ కార్టూన్ల కోసం అంతే ఆతృతగా ఎదురుచుస్తుంటారు. నిజానికి ఎంతోమంది నాయకులపై విమర్శనాత్మకంగా ఎన్ని కార్టూన్స్ వేసినా దాదాపు ప్రతి నాయకుడు కూడా పాజిటీవ్ గానే తీసుకునేవారట. తన 18వ సంవత్సరంలోనే కార్టూనిస్ట్ గా మొదలైన జీవితంలో కేవలం ఈనాడు వరకే పరిమితం అవ్వలేదు.. దేశ, అంతర్జాతీయ వేదికలపై కూడా తనదైన శైలిలో గళమెత్తాడు.
శ్రీధర్ కార్టూన్ లలో వ్యంగ్యం వుంటుంది, రక్తి కట్టించే క్యాప్షన్ ఉంటుంది వెరసి అతని కార్టూన్ల వెనక ఎంతో విషయ పరిజ్ఞానం కనపడుతుంది. ఇలా శ్రీధర్ ఈనాడులో 1982 నుండి 1999 వరకూ వేసిన రాజకీయ కార్టూన్లు ఒక సంకలనంగా తెచ్చారు ఉషోదయా పబ్లికేషన్స్. ఇందులో అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై శ్రీధర్ వేసిన వ్యంగ్యాస్త్రాలు వున్నాయి. అయితే ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలపైన గీసిన కార్టూన్లే కనిపిస్తాయి. శ్రీధర్ కార్టూన్ల లో బొమ్మలు నవ్విస్తాయని అందరికీ తెలుసు. అయితే బొమ్మ చూడగానే ఇది ఫలానా వ్యక్తిదని వెంటనే తెలిసిపోయేంతలా బొమ్మలు గీయడం అతని ప్రతిభ. ఆ పుస్తకం ముందుమాటలో రామోజీరావు “కాలంతో పోటిపడి ఈ లైనూ బెసగకుండా పర్ఫెక్ట్ రాజకియ వ్యంగ్య చిత్రాన్ని రక్తికట్టే క్యాప్షన్తో అత్యంత వేగంగా అందించగలిగే నేర్పు మాత్రం శ్రీధర్‌దేనని చెప్పగలను” అని రాసారు