జూన్ 10 వరకు బడి బంద్!

దేశంలో కోవిడ్-19 కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జూన్ 10 వరకు స్కూళ్లు మూసివేయాలని నిర్ణయంచారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు మమతా బెనర్జీ. అయితే, లాక్ డౌన్ కొనసాగింపు అంశం మీద ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించినట్టు ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. అయితే, […]

Written By: Neelambaram, Updated On : April 11, 2020 8:01 pm
Follow us on

దేశంలో కోవిడ్-19 కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జూన్ 10 వరకు స్కూళ్లు మూసివేయాలని నిర్ణయంచారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు మమతా బెనర్జీ. అయితే, లాక్ డౌన్ కొనసాగింపు అంశం మీద ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించినట్టు ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. అయితే, స్కూళ్ల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 10 వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు బెంగాల్లో లాక్ డౌన్ అమలు సరిగా జరగడం లేదంటూ కేంద్ర హోంశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమయంలో కూడా మత పరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నారంటూ అభ్యంతరం తెలిపింది. లాక్ డౌన్‌ ను కట్టుదిట్టంగా అమలు చేయాలంటూ డీజీపీని ఆదేశించింది.

పశ్చిమ బెంగాల్‌లో ఇంతవరకూ 116 కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృత్యువాత పడ్డారు. మొత్తం కేసుల్లో 89 యాక్టివ్ కేసులు కాగా, 22 మందికి స్వస్థత చేకూరింది.