ఆరోగ్యవంతమైన భారతం ముఖ్యం!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో తాజా పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ రోజు (శనివారం) ప్రధాని వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.  దేశ ప్రజలప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు.  దేశ ఉజ్జ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడికి ఇప్పటి […]

Written By: Neelambaram, Updated On : April 11, 2020 7:31 pm
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో తాజా పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ రోజు (శనివారం) ప్రధాని వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.  దేశ ప్రజలప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు.  దేశ ఉజ్జ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి తదుపరి 3-4 వారాలు  చాలా కీలకమని  పేర్కొన్నారు.

కోవిద్19పై పోరులో భాగంగా 21 రోజుల  లాక్ డౌన్  కాలంలో దేశంలో  కొన్ని అత్యవసర సేవలు తప్ప అన్ని ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేశామన్నారు. ఈ సందర్భంగా మార్చి 24 నాటి  తన ప్రసంగంలో జాన్ హైతో జహా (బతికుంటే.ప్రపంచాన్ని చూడవచ్చు) చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మోడీ…ఇపుడు జాన్ బీ, జహాన్ భీ (జీవితాలు, ప్రపంచం) రెండూ ముఖ్యమైనవే అన్నారు. అటు ప్రాణాలు, ఇటు ఆర్థిక వ్యవస్థ వైపు చూడాలని అని మోడీ చెప్పారు. ప్రాణాంతక వైరస్ నుంచి ఇటు ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూనే అటు ఆర్థికవృద్దిని దృష్టిలో పెట్టుకుని గురుతర బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.