అమరావతి భూముల విషయంలో వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించాలని వేసిన పిటిషన్ పై ఎటూ తేల్చుకోవడం లేదు. ఈ కేసు సుప్రీంకోర్టులో కాకుండా హైకోర్టులోనే జరగాలని కోరుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది. దీంతో కేసు మొదటికి వచ్చింది. ఏదో కావాలనే ఉద్దేశంతో వేసిన కేసుగా తేలిపోయింది. తమ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.
న్యాయవాది అభ్యర్థన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సుప్రీంకోర్టు విచారణకు రెండు వారాల గడువు ఇచ్చింది. దీంతో ఇప్పుడు హైకోర్టులోనే విచారణకు వెళ్తామని ఏపీ ప్రభుత్వం ఎందుకు అంటుందో ఎవరికి అంతుబట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి భూముల్లో ఏదో జరిగిపోయిందని నిరూపించాలన్న తాపత్రయంలోనే ఉంది. అవకతవకలు జరగకపోయినా, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ప్రభుత్వం సీఐడీ, సిట్ ల చే దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై గత విచారణలో కౌంటర్ కు సమయం కావాలని అడిగిన ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఇప్పుడు పిటిషన్ ను ఉపసంహరించుకుంటామని విన్నవించింది. హైకోర్టులోనే కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగాలని ఆకాంక్షించారు.
గతంలో ఈ వ్యవహారంపై తాము సీబీఐ దర్యాప్తు కోసం లేఖ రాశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఐడీ సిట్ నియమించామని పేర్కొంది. సీబీఐతో దర్యాప్తు చేయించినా అభ్యంతరం లేదని వాదించారు. హైకోర్టు తాత్కాలికతీర్పుపై మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పింది. రాజకీయ కుట్రపూరిత కేసు అని, ప్రతీకారం కోసం ఏపీ ప్రభుత్వం పాకులాడుతోందని ప్రభుత్వంపై దుమ్మాలపాటి తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే మండిపడ్డారు.