
నిర్మల్ లో ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్ పెట్రోల్ తో దాడి చేయడం కలకలం రేగింది. జిల్లాలోని కుబీర్ లో అధికారి రాజు పై పాతసాల్వి గ్రామ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ తో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అధికారి రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అధికారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.