కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కరోనా కాలంలో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని వారిపై అదనపు భారం పడకుండా ఏటీఎం సర్వీస్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఏటీఎం ద్వారా ఎస్బీఐ, ఇతర బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు చేస్తే సర్వీసు ఛార్జీలు ఉండవని పేర్కొంది. ఈ ఎత్తివేత నిర్ణయం జూన్ 30వరకు ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. దీని ద్వారా పరిమితి దాటిన ఏటీఎం ట్రాన్సక్షన్లపై ఛార్జీలు ఉండటం […]

Written By: Neelambaram, Updated On : April 16, 2020 12:40 pm
Follow us on


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కరోనా కాలంలో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని వారిపై అదనపు భారం పడకుండా ఏటీఎం సర్వీస్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఏటీఎం ద్వారా ఎస్బీఐ, ఇతర బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు చేస్తే సర్వీసు ఛార్జీలు ఉండవని పేర్కొంది. ఈ ఎత్తివేత నిర్ణయం జూన్ 30వరకు ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. దీని ద్వారా పరిమితి దాటిన ఏటీఎం ట్రాన్సక్షన్లపై ఛార్జీలు ఉండటం ప్రస్తుతం కస్లమర్లకు తీపి కబురేనే చెప్పొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ స్పష్టం చేసింది.

ఇటీవలే ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను 0.25శాతం తగ్గించించి కస్టమర్లకు షాకిచ్చింది. సేవింగ్స్ ఖాతాల్లోని అన్ని డిపాజిట్లకు కేవలం 2.75శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 15నుంచి అమలులోకి వచ్చాయి. అంతేకాకుండా ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేటులో 35బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 10నుంచే అమల్లోకి వచ్చింది. దీని వల్ల బ్యాంక్ నుంచి హోమ్ లోన్ వంటివి తీసుకున్నవారికి లబ్ధి చేకూరుతుంది. అలాగే ఫేక్ సైట్లతో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది.