Homeఆంధ్రప్రదేశ్‌సెటైర్ః చిన‌బాబు వ‌ర్సెస్ పెద‌బాబు!

సెటైర్ః చిన‌బాబు వ‌ర్సెస్ పెద‌బాబు!

Satire
చిన‌బాబుః (బ్యాగ్రౌండ్ సాంగ్‌.. ‘ఇది.. ర‌గుల్ తున్న.. అగ్నిప‌ర్వ‌తమ్‌..’) నాన్నారు..బాబుః ఏంటి నాన్నా?

చిన‌బాబుః ఆ గిచ్చెమ్ నాయుడు నా పేరుమీద పిచ్చిగీత‌లు గీసి, చెల్ల‌ని నోటుగా మార్చేస్తే.. మీరు మెడిటేష‌న్ చేస్తున్నారా? చెప్పండి.. ఎప్పుడు పీకేస్తున్నారు? నాకివాళే తెల్సాలి.. ఇప్పుడే తెల్సాలి.. తెల్సితీరాలి.. హా! బాబుః అది కాదు నాన్నా.. ముందు నువ్వు కూల‌వ్వు. ఇందా కూల్ డ్రింకు తాగు.

చిన‌బాబుః నాకు పెట్రోల్ పోసిన‌ట్టు మండిపోతావుంటే.. కూల్ డ్రింకుతో కూల్ చేస్తున్నారా? అవసరం లేదు. నేను ఇందాకే తాగాను. కమాన్ చెప్పండి.. ఎప్పుడు పీకేస్తున్నారు? బాబుః ఏంటా ఆవేశం చిన‌బాబు..? ఆ.. ఆవేశం ఏంట‌ని అడుతున్నానేను. ఇది రాజ‌కీయం. గోలీకాయ‌ల ఆట‌కాదు. ఇప్ప‌టికే మ‌నం టైమ్ ద‌రిద్రంగా ఉంది. కాస్త టైమ్ ఇవ్వండి.

చిన‌బాబుః నాన్నారూ.. ఇక చాలు. ఇన్నాళ్లూ మీ వ‌ల్ల నేను కోల్పోయింది చాలు. బాబుః నాన్నా…. ఎంత‌మాట‌న్నావు నాన్నా? ఏం కోల్పోయావు నాన్నా?

చిన‌బాబుః చిన్న చిన్న ఆవేశాల‌న్నీ కోల్పోయాను నాన్నా.. మీవ‌ల్ల‌! పార్టీ నేత‌ల‌తో ఏం మాట్లాడాలో మీరే చెప్తారు. మీటింగుల్లో ఏం మాట్లాడాలో మీరే చెప్తారు. ఆఖ‌రికి.. ఇంటికి ఎవ‌రైనా వ‌స్తే.. వాళ్ల‌తో ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారు. గొంతు పెగ‌ల‌ట్లేదు నాన్నా.
బాబుః ???

చిన‌బాబుః పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ పెడ‌తారు.. నేనేదో ఆవేశంగా మాట్లాడాల‌నుకుంటాను. కానీ.. మీరు కూల్ అంటారు. ఎలా మాట్లాడాలో మీరే రాసిస్తా‌రు. పొలిట్ బ్యూరో స‌మావేశం అంటారు.. న‌న్నూ పిలుస్తారు. నేను మైక్ ప‌ట్టుకుంటాను.. మీరు నా చెయ్యి ప‌ట్టుకుంటారు.. మీరు రాసింది నేను అప్ప‌జెప్పాక, ‘‘సూప‌ర్’’ అంటూ మీరే చప్ప‌ట్లు కొడ‌తారు. నవ్వుతున్నారు నాన్నా.. నన్ను చూసి బాబుః ???

చిన‌బాబుః చిన్న‌ప్ప‌ట్నుంచి నా ఆవేశాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేక‌.. మీకు న‌చ్చిన‌ట్టు మాట్లాడ‌లేక‌.. న‌ర‌కం చూశాన్నానా! బాబుః అదేంటి నాన్నా.. నేనేం చేసినా నీకోసమే కదా డాడీ?

చిన‌బాబుః అవును.. మీరు చేసే ప్ర‌తిప‌నీ నాకోస‌మే అంటారు. కానీ.. నా మ‌న‌సులో ఏముందో ఒక్క‌సారి కూడా తెలుసుకోరు.ఎందుకంటే.. అంతా మీకు న‌చ్చిన‌ట్టే జ‌ర‌గాలి క‌దా. చేస్కోండి.. మీకు న‌చ్చిన‌ట్టే చేస్కోండి. ఇన్నాళ్లూ నోర్మూసుకొని ఉన్నాను. ఇక నుంచి ఎవ్వ‌రు తిట్టినా చెవులు కూడా మూసుకుంటాను. కానివ్వండి.. మీకు న‌చ్చిన‌ట్టే కానివ్వండి! బాబుః నాన్నా.. న‌న్ను క్ష‌మించు నాన్నా! నీ మ‌న‌సులో ఇంత ఆవేశాన్ని దాచుకున్నావా? చెప్పొచ్చు గదరా నాతో?

చిన‌బాబుః నాకు తెల‌సు నాన్నా.. నేను ఆవేశ‌ప‌డితే మీరు త‌ట్టుకోలేర‌ని! అందుకే.. మౌనంగా ఉంటూ వ‌చ్చాను. మీరు చెప్పిందే చేస్తూ వ‌చ్చాను. ఇప్ప‌టికీ.. మీరు రాసిన స్పీచ్ నా చేతిలోనే ఉంది నాన్నా! బాబుః ఐయామ్ రియ‌ల్లీ సారీ నాన్నా.. ఆ చీటీ ఇటిచ్చేయ్‌.. ఈ మైక్ తీసుకో!

చిన‌బాబుః ఎందుకు నాన్నా..?
బాబుః వెళ్లు.. ఇన్నాళ్లూ దాచుకున్న నీ ఆవేశాన్ని ప్ర‌ద‌ర్శించు. నీకు న‌చ్చింది మాట్లాడేయ్‌. నిన్ను ప‌ప్పు అన్న‌వారికి నిప్పును ప‌రిచ‌యం చెయ్‌. దుమ్ము లేపెయ్‌.. ఏం జ‌రిగినా నే చూసుకుంటా. ఇక‌, నిన్నెవ్వ‌రూ ఆప‌లేరు. ఆ గిచ్చెమ్ నాయుడి మీద ఎలాంటి యాక్ష‌న్ తీసుకుంటావో నీ ఇష్టం.

చిన‌బాబుః అలాగే నాన్నారూ.. (బ్యాగ్రౌండ్ సాంగ్‌.. ‘‘అదిగదిగో.. ఆకాశం భల్లున తెల్లారి.. వస్తున్నాడదిగో అగ్గిపిడుగు అల్లూరి’’)

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular