https://oktelugu.com/

డ్రగ్ కేసు: సుశాంత్ ఫామ్ హౌజ్లో సారా.. రియా పార్టీలు?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు మిస్టరీని తలపిస్తోంది. సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ప్రస్తుతం దర్యాప్తు ఆ దిశగా కొనసాగుతోంది. తీగ లాగితే డొంక కదిలిన చందంగా తెరవెనుక నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు రియాచక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ పూర్తిగా ఇరుక్కుపోయారు. Also Read: హీరోగారి భారీ డిమాండ్లు.. ఇలా అయితే కష్టమే ! రియా చక్రవర్తి, ఆమె సోదరుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2020 / 05:46 PM IST
    Follow us on

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు మిస్టరీని తలపిస్తోంది. సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ప్రస్తుతం దర్యాప్తు ఆ దిశగా కొనసాగుతోంది. తీగ లాగితే డొంక కదిలిన చందంగా తెరవెనుక నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు రియాచక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ పూర్తిగా ఇరుక్కుపోయారు.

    Also Read: హీరోగారి భారీ డిమాండ్లు.. ఇలా అయితే కష్టమే !

    రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, డ్రగ్ డీలర్ బాసిత్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి విచారించగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 25మంది సెలబ్రెటీల పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. వీరు చెప్పిన వివరాల ప్రకారం పలువురు సెలబ్రెటీలకు నోటీసులు పంపించి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.

    డ్రగ్స్ పార్టీలన్నీ కూడా సుశాంత్ ఫామ్ హౌజ్లో జరిగేవని నిందితులు  విచారణలో వెల్లడించడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సుశాంత్ కు చెందిన లోనావాలా ఫామ్ హౌజ్ పై ఎన్సీబీ పోలీసులు ఇప్పటికే నిఘా ఉంచారు. 2018 నుంచి సుశాంత్ ఫామ్ హౌజ్ కు మేనేజరుగా వ్యవహరిస్తున్న రాయిస్ తాజాగా ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

    సుశాంత్ తన ఫామ్ హౌజ్ కు స్నేహితులతో కలిసి వచ్చేవాడని ఆయన తెలిపారు. వారంతా అక్కడే సరదాగా గడిపి వెళుతుండేవారని పేర్కొన్నాడు. తాను మేనేజర్ చేరిన సమయంలో సారా అలీఖాన్ తరుచూ ఫామ్ హౌజ్ కు వచ్చేదని.. ఇక్కడే పార్టీలు చేసుకునేవారని తెలిపాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు రియా చక్రవర్తి కూడా వీరితో జాయిన్ అయినట్లు తెలిపాడు.

    Also Read: ఓటీటీలోకి ‘నిశ్శబ్ధం’గా.. రిలీజ్ డేట్ అదే?

    వారంలో ఒకటి రెండుసార్లు సుశాంత్ తన స్నేహితులతో ఫామ్ హౌజ్ కు వచ్చేవాడని రాయిస్ తెలిపాడు. పార్టీల కోసం స్మోకింగ్ పేపర్ ఆర్డర్ చేసేవారని.. అయితే వాటితో వారు ఏం చేసేవారో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. ఈ పార్టీల్లో అతిథులకు ఖరీదైన వొడ్కా అందుబాటులో ఉంచేవారమని తెలిపాడు. గతేడాది జూలైలో రియా చక్రవర్తి పుట్టిన రోజును ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఇదే ఫామ్ హౌజ్లోలో చేసినట్లు రాయిస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.