అమరావతిలో భూ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ నివేదికను మీడియాకు, సోషల్ మీడియాకు ఇవ్వకూడదని మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు మీడియాలో.. న్యాయవర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.
Also Read: దేవాలయాల లొల్లి.. రంగంలోకి చంద్రబాబు
మీడియా హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి ఈ వార్తలను ప్రచురించలేదు. డిజిటల్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాల నుంచి నిన్న రాత్రే ఈ వార్తా నివేదికను తీసివేశారు. అయితే ఇది జాతీయ మీడియా నుంచి కొందరు.. అనేక మంది న్యాయ నిపుణుల నుండి ఏపీ హైకోర్టు నిర్ణయంపై తీవ్ర నిరసనలను వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ట్విట్టర్ లో ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.
జనాదరణ పొందిన జాతీయ వెబ్‌సైట్ ‘ది వైర్’ దీనిని రాజ్యాంగం ఊహించని స్వేచ్ఛా ప్రసంగ హక్కులను కాలరాసే ఒక గాగ్ ఆర్డర్‌గా అభివర్ణించింది. అయినప్పటికీ ప్రచురించబడని ఆ కథనంను ఏపీ హైకోర్టు విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు రాసుకొచ్చింది.
ఇక ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ‘మాజీ అడ్వొకేట్ జనరల్, ఇతర ప్రముఖులు అయిన నిందితులపై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ గురించి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ స్పందించడానికి వీల్లేదంటూ హై కోర్టు ఆదేశాలు నాకు షాక్ కు గురిచేశారు. హై కోర్టు ఆదేశాలు సమాచార హక్కు చట్టానికి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కూ విరుద్ధం…’ అని ఆయన ట్వీట్ చేశారు. ఏపీ హైకోర్టు ఆర్డర్ పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం అని స్పష్టం చేశారు.
ఇక ప్రముఖ జర్నలిస్టులు రాజ్ దీప్ సర్దేశాయ్, ఎన్డీటీవీ ఉమా సుధీర్ లు కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని అంటారు. ఒక సామాన్యుడికి, ఒక పెద్ద మనిషికి మధ్య ఇంత తేడానా? ఎందుకు దీని గురించి చర్చించకూడదని ఏపీ హైకోర్టు నిబంధనలు పెట్టిందని వారు ట్వీట్ చేశారు.
The story that caught my eye: when an aam aadmi is named in FIR, be prepared for worst.. when a khaas aadmi is named, get a gag order asap! https://t.co/6DjWWZFSDk
— Rajdeep Sardesai (@sardesairajdeep) September 16, 2020
ఇక ఏపీ హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిని విచారణ చేయాలని చెప్పాల్సింది పోయి ఆపేశారని అన్నారు. మీడియాలో రాకూడదని అంటూ రాత్రికి రాత్రి ఆదేశాలు రావడం భగం కలిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. పెద్దలకు ఒక తీర్పు.. సామాన్యులకు ఒక తీర్పు అనేలా పరిస్థితి ఉందని సజ్జల అన్నారు.దమ్మాలపాటి శ్రీనివాస్ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఒక ఇండిపెండెంట్ సంస్థ అని సజ్జల అన్నారు.
Also Read: నేతల కేసులపై ఇక ఫాస్ట్ ట్రాక్ విచారణ.. జగన్ కు కష్టమే?
దర్యాప్తు కోర్టులు చేయగలవా? అసలు దర్యాప్తే వద్దంటారా అని సజ్జల వ్యాఖ్యానించారు. ఒక అడ్వాకేట్ పై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా.. ఆధారాలు ఉన్నాయని కేసు నమోదు చేశారన్నారు.
బోండా ఉమామహేశ్వరరావు వీటిపై తీర్పు వస్తుందని నిన్న 5 గంటలకే చెప్పేసారని.. ఆయనకు ఈ విషయం ఎలా తెలిసిందని అన్నారు. హైకోర్టు ఆర్డర్ పై తాము సుప్రీం కోర్టుకు వెళతామని.. సుప్రీంలోనే తేల్చుకుంటామని సజ్జల తెలిపారు.