ఏపీ రాజకీయాలు మళ్లీ వెడెక్కుతున్నారు. ఏపీలో కరోనా విజృంభణ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇటీవల టీడీపీ మహానాడు కార్యక్రమానికి మినహా ఆయన ఏపీకి వచ్చిన దాఖలాల్లేవు. మహానాడు కార్యక్రమం కూడా జూమ్ యాప్లోనే నిర్వహించి మమ అనిపించారు. టీడీపీ నేతల వరుస అరెస్టులతో ఏపీలో టీడీపీ నేతలంతా సైలంటయ్యారు. అంతర్వేది ఘటన తర్వాత ఏపీలో మళ్లీ రాజకీయాలు హిటెక్కుతున్నాయి.
Also Read: ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
ఏపీలో అంతర్వేది ఘటనను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఆలయాల పరిరక్షణ పేరుతో బీజేపీ ఏపీలో హిందుత్వ శక్తులను ఏకం చేసేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలు దేవాలయ పరిరక్షణ కోసం జగన్ సర్కార్ ఏం చర్యలు చేపడుతుందంటూ నిలదీస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీకి మద్దతుగా రంగంలోకి దిగి జగన్ సర్కారును ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్నారు.
తాజాగా చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలోనూ సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని భక్తులు ఆందోళన చేస్తే వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ సంఘటనపై పోలీసులు నిస్పాక్షపాతంగా విచారణ జరిపి దోషులును శిక్షించాలని కోరారు. అదేవిధంగా దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని వాటిని ప్రభుత్వం కాపాడాలని కోరారు.
Also Read: నేతల కేసులపై ఇక ఫాస్ట్ ట్రాక్ విచారణ.. జగన్ కు కష్టమే?
తిరుమలలో ఇటీవల అన్యమత ప్రచారం పెరిగిందన్నారు. తిరుమల సంప్రదాయాలను ప్రతీఒక్కరు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. శారదాపీఠం మహాసభలకు శ్రీవారి సొమ్మును ఖర్చు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లోని అర్చకులపై ఇటీవల వేధింపులను పెరిగాయని ఆరోపించారు. విజయవాడలోని దుర్గమ్మ గుడిలో ఉన్న రథంలో వెండి సింహాలు కన్పించకుండా పోవడం ఏంటని ప్రశ్నించారు. ఆలయ ఈవోపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్వేది ఘటన తర్వాత ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు ఏకం అవుతున్నారు. ఈ పరిణామం జగన్ సర్కార్ ఇబ్బందులు తెచ్చేపెట్టేలా కన్పిస్తున్నాయి. దీనిపై సీఎం జగన్ ఎలా ముందుకెళుతారో వేచి చూడాల్సిందే..!