Ravi Teja Khiladi Collections: అదేంటో గానీ హీరో రవితేజ పరిస్థితి చూస్తుంటే ఆరు ప్లాపులు మూడు హిట్లు అన్నట్టు తయారవుతోంది. నిన్నమొన్న వచ్చిన కుర్ర హీరోలు కూడా సూపర్ హిట్లతో దూసుకపోతుంటే.. ఎప్పటి నుంచో సినీ ఫీల్డ్‌లో ఉన్న అనుభవం రవితేజను సక్సెస్ ట్రాక్‌లో ఎక్కువ సేపు ఉంచలేకపోతోంది. ఎన్నో ప్లాపుల తర్వాత మొన్ననే క్రాక్ మూవీతో సక్సెస్ బాట పట్టాడు.
అయితే ఈ సంబురం కొద్ది రోజులు కూడా ఉండలేదు. రీసెంట్ గా వచ్చిన ఖిలాడి మూవీకి పెద్దగా టాక్ రాలేదు. కాగా మొదటి నుంచి ఈ మూవీకి కావాల్సినంత బజ్ వచ్చింది. దాంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రమేష్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో డీలా పడిపోయింది. దీంతో కలెక్షన్ల పరంగా చాలా వెనకబడిపోయింది.
Also Read: వైరల్ అవుతున్న టుడే మూవీ డేట్స్
యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర చేయడంతో అటు తమిళంలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది ఈ మూవీ మీద. కానీ ఖిలాడీ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.19.50 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది. ఇక ఓవర్సీస్, కర్నాటక, రెస్టాఫ్ ఇండియాతో కలిపి మొత్తం రూ.22.80 కోట్ల బిజినెస్ చేసింది. అయితే 10వ రోజు మాత్రం కొంచెం కలెక్షన్లు పెరిగాయి. రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు కొంత పెరిగాయి. మొత్తంగా రూ.11.05 కోట్లు షేర్ వసూలు చేయగా.. రూ. 18.79 కోట్లు గ్రాస్ సాధించింది రవితేజ మూవీ.
అయితే వీకెండ్ సన్ డే బాగా కలెక్షన్లు వస్తాయని అంతా అనుకున్నప్పటికీ పెద్దగా కలెక్షన్లు మాత్రం పెరగలేదు. వాస్తవానికి ఈ మూవీ మీద ఉన్న అంచనాలకు మరింత కలెక్షన్లు వసూలు చేయాల్సి ఉంది. కానీ మొదటి నుంచి డివైడ్ టాక్ రావడంతో వీకెండ్ లో కలెక్షన్లు పెరగలేదు. ఇదే రవితేజ మూవీకి పెద్ద మైనస్ గా మారిపోయింది. పైగా ఏపీలో టికెట్ల రేట్లు పాత పద్ధతిలోనూ ఉన్నాయని తెలుస్తోంది.
Also Read: ఆ విషయంలో నాకు శ్రీదేవే స్ఫూర్తి – ఆలియా భట్