
AP New CS:ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా ఎవరూ ఊహించని వ్యక్తిని నియామకం చేసి షాకిచ్చారు సీఎం జగన్. ఏపీ కేడర్ లో ఉన్న వారిలో అస్సలు అధికారి ఏపీ సీఎస్ కాబోతున్నారు.
అక్టోబర్1 నుంచి నూతన సీఎస్ గా సమీర్ శర్మ అనే సీనియర్ ఐఏఎస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త సీఎస్ గా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అక్టోబర్ 1న సమీర్ శర్మ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. సమీర్ శర్మ ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. ఇప్పటికే మూడు నెలల పొడిగింపులో ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు.
ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా డాక్టర్ సమీర్ శర్మ ఉన్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్ గవర్నెన్స్ సంస్థ (ఐఎల్ఈజీ) వైస్ చైర్మన్, సభ్య కార్యదర్శిగా ఉన్నారు.