Salmonella outbreak: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఆ ఉల్లే నేడు ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. ఉల్లిలో నుంచి వచ్చే సొల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వ్యాపించి ప్రజలను తీవ్ర అస్వస్థతకు గురిచేస్తోంది. ఇటీవల అమెరికా, కెనడా దేశాల్లో ఉల్లి ద్వారా వ్యాపిస్తున్న బ్యాక్టీరియాతో ప్రజలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఉల్లిని చూస్తేనే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఈ వ్యాధి బారిన పడితే విపరీతమైన జ్వరం, వాంతులు, డయేరియా, కడుపునొప్పి, మలంలో రక్తం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల ముసలి వారైనా ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది.
అమెరికాలోని 37 స్టేట్లలో ఉల్లిని చూస్తేనే జంకుతున్నారు. బ్యాక్టీరియా బారిన పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెక్సాస్, వర్జీనియా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో దీని బారిన ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది. ఉల్లి నుంచి వ్యాపించడంతో దాన్ని చూస్తేనే భయపడుతున్నారు. ఉల్లి వాడకం క్రమంగా తగ్గిపోతోంది.
మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లి నుంచే ఈ వ్యాధి సోకే ప్రమాదముందని తెలుసుకుని జాగ్రత్తలు చేపడుతున్నారు. దీంతో పలు దుకాణాల్లో ఉన్న ఉల్లిని బయట పడేయాలని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి చేరాలని చెబుతున్నారు. ఎక్కువగా నీళ్లు తాగితే దీని బారిన పడకుండా బయట పడొచ్చని శాస్ర్తవేత్తలు వెల్లడిస్తున్నారు.