https://oktelugu.com/

Sajjala Bhargav: నాయకత్వానికి కాకా పడుతున్న సజ్జల భార్గవ్.. ఏంటి కథ?

వైసీపీ సోషల్ మీడియా విభాగం బలోపేతం కంటే.. తన వ్యక్తిగత ప్రయోజనాలకే భార్గవ్ పెద్దపీట వేస్తున్నారు అన్న ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లోప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భార్గవ్ బలంగా భావిస్తున్నారట.

Written By: , Updated On : August 8, 2023 / 12:14 PM IST
Sajjala Bhargav

Sajjala Bhargav

Follow us on

Sajjala Bhargav: వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి. ఆయనకు ఉన్న పదవి ప్రభుత్వ సలహాదారు. కానీ అన్ని విషయాలను మాట్లాడతారు. ప్రస్తుతం వైసీపీలో నెంబర్ టు గా మారారు. ఆ పోస్ట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు గానీ.. అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్చార్జిగా నియమించుకున్నారు. అది అత్యంత కీలకమైన పోస్ట్. ఇప్పుడు వైసీపీలో భార్గవ రెడ్డి పాత్ర కూడా అమాంతం పెరిగింది.

వైసీపీ సోషల్ మీడియా విభాగం బలోపేతం కంటే.. తన వ్యక్తిగత ప్రయోజనాలకే భార్గవ్ పెద్దపీట వేస్తున్నారు అన్న ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లోప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భార్గవ్ బలంగా భావిస్తున్నారట. తండ్రి రామకృష్ణారెడ్డి సైతం పావులు కదుపుతున్నట్లు సమాచారం. కడప జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గ నుంచి భార్గవ్ను పోటీ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ నాయకత్వం నుంచి ఆశించినంత స్పందన రాలేదని తెలుస్తోంది.

దీంతో హై కమాండ్కు కాక పెట్టే పనిలో తండ్రీ కొడుకులు ఉన్నారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే సజ్జల భార్గవ్ తన ట్విట్టర్ ఖాతాలో చేస్తున్న కామెంట్స్ వైసిపి నాయకత్వాన్ని ఆకర్షించేలా ఉన్నాయి. ఇటీవల విడుదలైన సర్వేలు,ఒపీనియన్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే. వాటన్నింటినీ క్రోడీకరించి’ యాడైనా మాదే హవా’ అంటూ చేసిన పోస్టింగ్స్ ఆకట్టుకుంటున్నాయి.అయితే ఇదంతా నాయకత్వాన్ని కాకపట్టేందుకేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు భార్గవ్ చేతిలోకి వచ్చాక.. ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని పార్టీలోనే ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో ట్విట్టర్ ఖాతాలో చేస్తున్న అనుకూల పోస్టింగులు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. వైసీపీలో ఇది చర్చకి దారి తీస్తోంది.