https://oktelugu.com/

నటి శ్రావణి చావుకు వాళ్లిద్దరే కారణమా?

‘మనసు మమత’ , మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతోంది. శ్రావణి ఆత్మహత్య వ్యవహారంలో సాయికృష్ణ పేరు మొదట వినిపించింది. ఆ తర్వాత దేవరాజు రెడ్డి అన్నారు.వీరిద్దరితోపాటు ఓ సినిమా నిర్మాత పేరు కూడా వినిపిస్తోంది. అయితే తాజా విచారణలో అసలు నిందితులు ఎవరో తేలినట్టు తెలిసింది. Also Read : మెగా బ్రదర్ నాగబాబుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2020 / 12:30 PM IST
    Follow us on

    ‘మనసు మమత’ , మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతోంది. శ్రావణి ఆత్మహత్య వ్యవహారంలో సాయికృష్ణ పేరు మొదట వినిపించింది. ఆ తర్వాత దేవరాజు రెడ్డి అన్నారు.వీరిద్దరితోపాటు ఓ సినిమా నిర్మాత పేరు కూడా వినిపిస్తోంది. అయితే తాజా విచారణలో అసలు నిందితులు ఎవరో తేలినట్టు తెలిసింది.

    Also Read : మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?

    పోలీసులు శ్రావణి ఆత్మహత్యకు సాయి, దేవరాజ్ కారణమని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వారిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాతను విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

    దేవరాజ్, సాయికృష్ణ వేధింపులు భరించలేకనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మూడు రోజుల నుంచి దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. శ్రావణి చనువుగా ఉండడం ఇష్టం లేకనే దేవరాజ్, సాయి గొడవ పడ్డారని అంటున్నారు.

    సినిమాలపై పిచ్చిప్రేమతో ఎనిమిదేళ్ల క్రితం శ్రావణి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు నుంచి హైదరాబాద్ వచ్చింది. ఆమెకు ఫ్రెండ్ ద్వారా సాయికృష్ణ పరిచయమయ్యాడు. శ్రావణికి సినిమాలు, సీరియల్స్ లో అవకాశం ఇప్పించాడు. ఆర్థికంగా ఆమె ఎదుగుదలలో దోహదపడ్డాడు.దీంతో శ్రావణిపై ప్రేమను పెంచుకున్నాడు. వారి కుటుంబ సభ్యులతో కూడా సాన్నిహిత్యం పెంచుకొని వారి ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటున్నాడు.

    అయితే ఈ మధ్య టిక్ టాక్ ద్వారా దేవరాజ్ శ్రావణికి పరిచయం అయ్యాడు. చనువు పెంచుకున్నాడు. కొద్దిరోజులు శ్రావణి ఇంట్లోనే దేవరాజ్ ఉన్నాడు. వీరిద్దరూ క్లోజ్ గా ఉండడం సాయికి నచ్చలేదు. పోలీస్ స్టేషన్ వరకు గొడవ వెళ్లడంతో దేవరాజ్ దూరంగా జరిగాడు. ఈనెల 7న దేవరాజ్ ను శ్రావణి రెస్టారెంట్ లో కలవడం.. సాయి వచ్చి గొడవ చేయడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే సాయి రెస్టారెంట్ లో శ్రావణిపై చేయిచేసుకున్నట్టు సమాచారం. దీంతోపాటు సాయి, ఫ్యామిలీ మెంబర్స్ వేధించారని.. దాడి చేశారని శ్రావణి పేర్కొందని దేవరాజ్ పోలీసులకు ఆడియో క్లిప్స్ అందజేశాడు.

    దీంతో పోలీసులు శ్రావణి ఆత్మహత్యకు సాయి, దేవరాజ్ కారణమని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వీరిద్దరూ శ్రావణి ప్రేమ కోసం పడిన గొడవ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించినట్టు సమాచారం. దేవరాజ్ , సాయిలను అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది.

    Also Read : బిగ్ బాస్ 4 : హౌస్ లో నోయల్ క్రష్ తనే…?