S Jaishankar foreign policy : మనదేశంలో మంత్రుల దగ్గర నుంచి మొదలుపెడితే ఎమ్మెల్యేల వరకు కులాలు, గోత్రాలు, జాతక చక్రాలు వంటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. కానీ ఇందులో కొంతమంది ఇమిడి పోరు. పైగా వారు విశ్వమానవులుగా ఎదుగుతుంటారు. అలాంటి వారిలో అగ్రగణ్యుడు సుబ్రహ్మణ్యం జై శంకర్. తమిళ బ్రాహ్మణ మూలం. ఢిల్లీలోనే పుట్టారు. అక్కడే ఎదిగారు. జై శంకర్ తండ్రి పేరు సుబ్రమణ్యం. ఈయన సివిల్ సర్వెంట్ గా పని చేశారు. అంతకంటే ముందు జర్నలిస్టుగా పనిచేశారు. విదేశీ వ్యవహారాలపై విపరీతమైన పట్టు ఉంది. వర్తమాన విషయాలపై విశ్లేషణ చేసే సత్తా ఉంది. ఆయన రాసే రాతల ప్రభావం జై శంకర్ విపరీతంగా ఉంది. జై శంకర్ సోదరుడు సంజయ్ సుబ్రహ్మణ్యం కూడా అద్భుతమైన చరిత్రకారుడు.. చరిత్ర మీద చాలా పుస్తకాలు రాశాడు. ప్రముఖ యూసీఎల్ఏ హిస్టారియన్, అమెరికా ప్రొఫెసర్ కెరోలిన్ ఫోర్డ్ ను సంజయ్ వివాహం చేసుకున్నారు.. జై శంకర్ ఇంకో సోదరుడు విజయ్ కుమార్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఖనిజ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. ఈయన ఢిల్లీ లోని జేఎన్ యూ లో అంతర్జాతీయ సంబంధాలు అనే అంశంపై పిహెచ్డి చేశారు. జై శంకర్ 1977 లోనే సివిల్స్ సాధించాడు. దేశంలోనే అత్యున్నత విభాగమైన విదేశాంగ శాఖలో చేరిపోయాడు. డ్రాగన్ దేశంలో ఎక్కువ కాలం పని చేశాడు. అంతేకాదు భారతదేశానికి సంబంధించి రాయబారిగా కూడా అక్కడ పని చేశాడు.. అమెరికా, సింగపూర్, చైనా, రష్యా, జపాన్ దేశాలలో కీలక సందర్భాల్లో, కీలక శాఖల్లో పని చేశాడు.
జై శంకర్ జపాన్ లో పనిచేస్తున్నప్పుడు ఆయన భార్య శోభ క్యాన్సర్ తో కన్ను మూసింది. ఇక అక్కడ జపాన్ మహిళా క్యో కో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మరి.. పెళ్లిదాకా దారి తీసింది. వాస్తవానికి జై శంకర్ కు మొదటి భార్య శోభతో ధ్రువ అనే కుమారుడు, మేథ అనే కుమార్తె ఉన్నారు. క్యోకో ద్వారా జై శంకర్ కు అర్జున్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక ధ్రువ తన అమెరికన్ స్నేహితురాలు కసాండ్రా ను వివాహం చేసుకున్నాడు.. అతడు రిలయన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న థింక్ ట్యాంక్ రీసెర్చ్ ఫౌండేషన్ కు అమెరికా అధిపతిగా కొనసాగుతున్నాడు. మేధ కూడా క్రియేటివ్ సైడ్ పనిచేస్తోంది. తంగా వీళ్ళ కుటుంబం మొత్తం ఏకంగా అంతర్జాతీయ హద్దులు కూడా దాటేసి.. అత్యున్నతమైన హోదాలలో పనిచేస్తోంది. జై శంకర్ నిబద్ధత కలిగిన వ్యక్తి. తనకు ఇచ్చిన పనిని నూటికి నూరు శాతం సమర్ధతతో పనిచేసే వ్యక్తి. అందువల్లే ఇతడికి కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. అప్పట్లో నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళినప్పుడు.. ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాల్సి వచ్చినప్పుడు జై శంకర్ నే అప్రోచ్ అయ్యారు. దానిని ఒక రేంజ్ లో సక్సెస్ చేశాడు జై శంకర్. ఆ తర్వాత నరేంద్ర మోడీ కండ్లపడ్డాడు. అప్పటి నుంచి అతని భద్ర పెట్టలేదు. 2019లో సెంట్రల్ ఫారిన్ మినిస్ట్రీ జై శంకర్ కు వచ్చింది. మొదట్లో రాయబారి.. ఆ తర్వాత ఫారిన్ మినిస్ట్రీ సెక్రెటరీ.. ఇప్పుడు ఫారిన్ మినిస్ట్రీ వచ్చింది.
మొదట్లో రష్యా.. ఆ తర్వాత చైనా.. అమెరికా.. జపాన్.. అతడి తల పండిపోయింది. అందువల్లే మోడీకి ఫారిన్ వింగ్లో పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. జై శంకర్ ను మోడీ అనడు. అజిత్ దోవల్ తప్ప.. మిగతా క్యారెక్టర్లు జై శంకర్ వ్యవహారాలలో వేలు పెట్టరు. ఎందుకంటే అతడు రెగ్యులర్ పొలిటిషన్ కాదు. అవినీతి మరకలు లేవు. అడ్డగోలు వ్యవహారాలు లేవు. ఈ దేశానికి సంబంధించి ఈ రోజుల్లో కావాల్సింది జై శంకర్ లాంటి క్యారెక్టర్ మాత్రమే.