Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రా సరిగ్గా ఏడాదిగ్రతమే కపిల్ జైన్ ఓ నెటిజన్ అనేక అనుమానాలు వ్యక్తం చేశాడు..” ఈమె ఏదో చేస్తోంది. ఈమె పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక కన్ను వేసి ఉంచాలి.. ముందు ఆమె పాక్ ఎంబసీ ఈవెంట్ కు వెళ్ళింది. అనంతరం పాకిస్తాన్ దేశానికి వెళ్లింది. అక్కడ చాలా రోజులపాటు ఉంది. మల్లి తిరిగి వచ్చింది. ఇప్పుడు కాశ్మీర్ కూడా వెళ్ళింది. అక్కడ ఏదో లింకు ఉంది. మొత్తంగా ఈమె ఏదో చేస్తోంది. దీనివల్ల ఏదో జరగబోతుందని” ఓ నెటిజన్ మే 10న ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే నాడు ఆ నెటిజన్ చేసిన ట్వీట్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పట్టించుకోని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది..” నాడు ఆ నెటిజన్ తనవంతుగా ఏదో గ్రహించి ట్విట్ చేశాడు. దానిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకోని ఉంటే ఇవాళ దేశానికి ఈ పరిస్థితి వచ్చే ఉండేది కాదు. ఇప్పటికైనా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇలాంటి వ్యక్తుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
Also Read : ఉగ్రదాడికి ముందు.. జ్యోతి మల్హోత్రా పహల్గాం పర్యటన.. వెలుగులోకి సంచలన నిజం!
దేశద్రోహానికి ఇదే ఆధారం
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయానికి ఓ వ్యక్తి కేక్ తీసుకుని వచ్చాడు. ఆ వ్యక్తితో కలిసి జ్యోతి ఫోటోలు దిగింది. పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి పని చేస్తున్నట్టుగా ఆ వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పహల్గాం దాడి తర్వాత భారత్ పర్సోనా నాన్ గ్రేటా కింద అతడిని బహిష్కరించింది కూడా. ఈ ప్రకారం జ్యోతికి ఉగ్రవాద దేశానికి సంబంధించిన వర్గాలతో పనిచేసినట్టు తెలుస్తోంది.. జ్యోతి గతంలో పాకిస్తాన్లో పర్యటించినప్పుడు కొంతమంది వ్యక్తులతో ఆమె సన్నిహితంగా ఉందని తెలుస్తోంది. అయితే వారంతా కూడా ఉగ్రవాద దేశంలోని ఐఎస్ఐ తో సంబంధాలు కొనసాగించినట్టు సమాచారం. అయితే జ్యోతికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆమె గురించి మరిన్ని ఆధారాలు వెతికే పనిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఉన్నారు. అంటే జ్యోతి చేసిన కార్యకలాపాలు ఇంకా చాలానే ఉన్నాయని.. అవి దేశానికి హాని చేసేవని తెలుస్తోంది. జ్యోతి ఉదంతాలు బయటికి వస్తున్న నేపథ్యంలో.. మనదేశంలో చాలామంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ పై నిఘా విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనకు శత్రువులుగా ఉన్న దేశాలలో వారు పర్యటించిన వీడియోలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.