Shivaji Sensational Comments On Amaravati: ఈమధ్య కాలం లో హీరో శివాజీ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ‘దండోరా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఆ అంశం గురించి ఎక్కడో ఒక చోట మాట్లాడుకుంటూనే ఉన్నారు . ఈ వ్యాఖ్యలు శివాజీ కి పబ్లిక్ లో మంచి పాజిటివ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మా మనసులోని మాటలనే శివాజీ చెప్పాడు అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే రీసెంట్ గా ఆయన అమరావతి ని దుబాయ్ తో పోలుస్తూ ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి భిన్నమైన అభిప్రాయాలను సొంతం చేసుకుంటుంది. కొంతమంది ట్రోల్ చేస్తుంటే, మరికొంత మంది మాత్రం శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?
ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం . ఆయన మాట్లాడుతూ ‘నేను ఎన్నో రోజుల నుండి జనంతో , రాజకీయ నాయకులతో ఒక విషయం గురించి చెప్తున్నాను. ఇవాళ దుబాయి మహా నగరం ప్రపంచాన్ని మరోసారి ఆలోచించుకోమని చెప్తుంది. ఒక చిన్న యుద్ధం వస్తే దుబాయ్ అల్లాడిపోతోంది. దుబాయి కి ప్రత్యామ్నాయంగా ఉండే ఏకైక సిటీ అమరావతి. అటు సౌత్ ఈస్ట్ ఏషియా కి కానీ , ఇటు వెస్ట్రన్ కంట్రీస్ కి వెళ్ళడానికి కానీ , అమరావతి పెద్ద హబ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏవియేషన్ కి చాలా అనుకూలంగా ఉంటుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అమరావతి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది, ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా ఎవ్వరూ చెప్పలేరు, అలాంటి క్యాపిటల్ ప్రపంచం లోనే ది టాప్ గా నిలవబోతుందా ? , కామెడీ కి అయినా హద్దు ఉండాలి కదా అంటూ శివాజీ పై సెటైర్లు వేస్తున్నారు నెటిజెన్స్.
అయితే దీనిపై కూటమి పార్టీ అభిమానులు కూడా చాలా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు చంద్ర బాబు పై ఇలాంటి ట్రోల్స్ చాలానే వచ్చాయి. కానీ ఇప్పుడేమైంది. ప్రపంచం లోనే మోడరన్ సిటీస్ లో ఒకటిగా నిల్చింది. అమరావతి కూడా కచ్చితంగా ఆ రేంజ్ వెళ్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే శివాజీ ‘సాంప్రదాయినీ..సుప్పినీ..సుద్దపూసని ‘ అనే చిత్రం లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు ఆయన నిర్మాత కూడా. ఈ చిత్రం విడుదలకు ముందు శివాజీ ఎన్నో ప్రొమోషన్స్ పాల్గొన్నాడు. అందులో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇవి.
సింగపూర్ పోయింది!!!!
కొత్తగా దుబాయ్ వచ్చింది !!!! pic.twitter.com/diVbzvT1vU— The Samosa Times (@Samotimes2026) March 8, 2026