RRR Movie NTR Fans: పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ గా రాబోతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఐతే, ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ముఖ్యంగా ఎన్టీఆర్ క్రేజ్ ఒక్క ఇండియాకే పరిమితం కాలేదు. విదేశాల్లో కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను ఫ్యాన్స్ రకరకాల రూపాల్లో తెలుపుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా కెనడా నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
‘ఆర్ఆర్‌ఆర్, ఎన్టీఆర్’ పేర్లను కార్లతో చూపిస్తూ.. ఎన్టీఆర్ కు అలాగే మిగిలిన చిత్రబృందానికి కెనెడా ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఫ్యాన్స్ చేసిన ఈ వినూత్న వీడియోకి చిత్ర యూనిట్ కూడా సంబరపడిపోయింది. ఈ సినిమా ట్రైలర్ లో ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’గా కేవలం కొన్ని సెకెన్ల షాట్ లోనే అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో పాటు అనితరసాధ్యమైన తన ఎమోషనల్ ఫెర్మామెన్స్ తో ఆకట్టుకున్నాడు.
Also Read: మహేష్ – రాజమౌళి’ సినిమా ఎక్స్ క్లూజివ్ డిటైల్స్
అందుకే అభిమానులతో పాటు యావత్తు సినీ లోకం అంతా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను పదే పదే చూసి మురిసిపోతుంది. దాంతో.. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ప్రత్యేకం అన్నట్టు క్రియేట్ అయిపోయింది. ట్రైలర్ లో ఎన్టీఆర్ చిన్నపాటి నటనా విశ్వరూపానికే ఫ్యాన్స్ ఈ రేంజ్ హడావుడి చేస్తుంటే.. ఇక సినిమా రిలీజ్ అయ్యాక రెండు గంటల పాటు ఎన్టీఆర్ నటనను చూసి.. ప్రేక్షకులు ఇక ఏ స్థాయి హడావుడి చేస్తారో.
ఏది ఏమైనా తారక్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. మరోపక్క ఈ వీడియో చూసి మెగా ఫ్యాన్స్ అసూయ పడుతున్నారు. చరణ్ కి కూడా ఇలాంటి స్పెషల్ వీడియోలు ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎంతైనా ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో.. మొదటి నుండి ఈ సినిమా పై స్పెషల్ అభిమానాన్ని చూపిస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు.
అలాగే మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో కనిపించబోతుండటంతో.. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎలాగూ నేషనల్ రేంజ్ లో గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు రాజమౌళి. అందుకే ఏ చిత్రానికి లేనంత క్రేజీగా ఈ చిత్రం ప్రీమియర్ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ప్రీ టికెట్ సేల్స్‌లో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ ను సృష్టించింది.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్