Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పురపాలక శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం అందరిలో కలవరం కలిగించింది. ఎంతో భవిష్యత్ ఉన్న నేతగా ఆయనకున్న మంచి పేరు నేపథ్యంలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాల వారు కూడా హాజరై ఆయన మరణంపై సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దీంతో గౌతంరెడ్డికి ఉన్న గుర్తింపు తెలుస్తోంది. అందరితో కలివిడిగా మెలిగే మేకపాటి ఏనాడు కూడా ఎవరిని పల్లెత్తు మాట అనలేదనే ఉద్దేశంతోనే ఆయనకు ఇంతటి సానుభూతి వ్యక్తమైంది. ఆయన దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
భగవద్గీతలో చెప్పినట్లు మరణించిన వారికి జననం తప్పదు. జన్మించిన వారికి మరణం తప్పదు అన్నట్లు దైవ నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు కానీ మనం చేసే పనులే మనకు కీర్తిని తెచ్చిపెడతాయి. ఆ కీర్తి ప్రతిష్టలే మనకు గుర్తింపుగా నిలుస్తాయి. అంతేకానీ బంగారం, నగదు, భూములు ఏవీ కూడా మన వెంట రావని తెలిసినా అందరిలో ఎందుకు అత్యాశ అర్థం కాదు. మేకపాటి గౌతం రెడ్డి మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఆయన మృతిపై ఎన్నో సందేహాలు వస్తున్నాయి.
Also Read: భారీగా పెరిగిన ‘సలార్’ బడ్జెట్.. వర్కౌట్ అవుతుందా ?
దీనిపై ఆయన కుటుంబ సభ్యులు కూడా స్పష్టత ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన మరణంపై అనేక అనుమానాలు వస్తున్నా వారి మాటల్లో స్పష్టత లేకపోవడంతోనే ఇలా సంశయాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు గౌతం రెడ్డి మరణంపై అనుమానాలు పటాపంచలు చేశారు. రాత్రి 9.45 గంటలకు ఇంటికి చేరుకున్నారని తెలిపారు.
ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచి 6.30 వరకు ఫోన్ లో సంభాషించారని పేర్కొన్నారు. అనంతరం డ్రైవర్ ను రమ్మని వంట మనిషికి చెప్పినట్లు తెలుస్తోంది. డ్రైవర్ వచ్చే లోపే సోఫాలో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే కారులో ఆపోలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.వైద్యులు చికిత్స అందించినా ఆయన శరీరం సహకరించలేదని తెలుస్తోంది. చివరకు ఉదయం 9.16 గంటలకు వైద్యులు ఆయన మరణించారని ప్రకటించడం తెలిసిందే. దీంతో ఆయన మరణంపై అనుమానాలు అక్కర్లేదని చెబుతున్నారు.