Vijay Devarakonda: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే అందుకు ఆమె ఒప్పుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. యశ్ హీరోగా నటించిన ‘KGF’ సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా నటించింది. సెన్సేషనల్ స్టార్ గా విజయ్ దేవరకొండకి క్రేజ్ ఉంది కాబట్టి.. శ్రీనిధి శెట్టి, ‘విజయ్ దేవరకొండ’తో రొమాన్స్ కి ఒప్పుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
Also Read: గౌతం రెడ్డి హఠాన్మరణం: యువతలో గుండెపోటుకు కారణాలేంటి?
పూరి ప్రస్తుతం చేస్తున్న సీక్వెన్స్ లో.. విజయ్ దేవరకొండను పక్కా బాక్సర్ గా భారీ బిల్డప్ తో చూపించబోతున్నాడట. పైగా ఈ ఫైట్ సినిమా కథనే మలుపు తిప్పుతుందని.. కీలకమైన ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే ఉండబోతుందని తెలుస్తోంది.

అందుకే దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారట. కాగా వచ్చే నెలలో ఫస్ట్ వీక్ లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయనున్నారు. నిజానికి ఎప్పుడో ఈ సినిమా పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూనే ఉంది.
అన్నట్టు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కష్టపడి సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. పూరి అయితే, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రేక్షకులు కూడా ఆ స్థాయి అంచనాలు పెట్టుకుంటే సినిమాకి కలెక్షన్స్ వస్తాయి.
Also Read: భీమ్లా నాయక్ ట్రైలర్ సునామీ.. రికార్డులు చెరిపేస్తూ ఊచకోత
[…] Also Read: ‘విజయ్ దేవరకొండ’తో కేజీఎఫ్ హీరోయిన్ … […]
[…] Bheemla Nayak: దేనికైనా ఓ లెక్క ఉండాలి. సమాయానికి పూర్తిచేయగల సామర్థం ఉండాలి. టైం టు టైం పనిచేస్తేనే సినిమా పూర్తి అవుతుంది. షూటింగ్ ల పేరిట కాలయాపన చేస్తే ఎన్ని ఏళ్లు అయినా చిత్రం పూర్తికాదు. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలోనూ అనుకోని జాప్యం ఏర్పడింది. ఎందుకంటే కరోనా కల్లోలంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత షూటింగ్ ప్రారంభైనా ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే అనివార్యంగా సినిమా ఫస్ట్ కాపీ తయారీ జాప్యమైందట. తాజాగా ట్రైలర్ ను చూస్తేనే ఆదరబాదరాగా రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. […]
[…] Also Read: ‘విజయ్ దేవరకొండ’తో కేజీఎఫ్ హీరోయిన్ … […]