https://oktelugu.com/

By-election : ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా.. యూపీలో బీజేపీ, బెంగాల్‌లో టీఎంసీ అధిక్యం..

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు నవంబర్‌ 20న ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన కౌంటింగ్‌ శనివారం(నవంబర్‌ 23న) ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 23, 2024 12:59 pm
    By-election

    By-election

    Follow us on

    By-election : దేశంలో రెండు నెలలుగా ఆసక్తి రేపుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 20 ముగిసింది. దీంతో నవంబర్‌ 23న ఈసీ కౌంటింగ్‌ చేపట్టింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలో 11 గంటల వరకు రానున్నాయి. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు, దేశంలోని 13 రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూఆ రానున్నాయి. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ కూడా జరుగుతోంది.

    ఉప ఎన్నికల్లో అధికార పార్టీలకు లీడ్‌..
    ఇక దేశంలో నంబర్‌ 20న 46 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల్లో వయనాడ్‌లో ప్రియాంగా గాంధీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఆమె ఇప్పటికే లక్షకుపైగా మెజారిటీతో లీడింగ్‌లో ఉన్నారు. ఇక అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో.. ఉత్తర ప్రదేశ్‌లో 9 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 6 స్థానాల్లో అధికార బీజేపీ అధిక్యంలో ఉంది. 2 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ, ఒక స్థానంలో ఆర్‌ఎల్‌డీ ఆధిక్యంలో ఉంది. ఇక బెంగాల్‌లో 6 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఆరు స్థానాల్లోనూ అధికార టీఎంసీ అభ్యర్థులు అధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.