https://oktelugu.com/

Priyanka Gandhi : అన్న రికార్డు బద్ధలు కొట్టబోతున్న చెల్లి.. వయనాడ్‌లో పియాంకకు భారీ మెజారిటీ..

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు నవంబర్‌ 20న ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన కౌంటింగ్‌ శనివారం(నవంబర్‌ 23న) ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 8 రౌండ్ల ఫలితాలు వచ్చాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 23, 2024 / 01:08 PM IST

    Priyanka Gandhi

    Follow us on

    Priyanka Gandhi :  దేశంలో రెండు నెలలుగా ఆసక్తి రేపుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 20 ముగిసింది. దీంతో నవంబర్‌ 23న ఈసీ కౌంటింగ్‌ చేపట్టింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి, జార్ఖండ్‌లో జేఎంఎం కూటమికి అధికారం ఖాయమైంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు, దేశంలోని 13 రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయి. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ కూడా జరుగుతోంది.

    వయనాడ్‌లో ప్రియాంక హవా..
    తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారు. ఆమె రాజకీయాల్లో చాలాకాలంగా ఉంటున్న చట్ట సభలకు ఎన్నిక కాలేదు. ఇటీవల రాహుల్‌గాంధీ కేర ళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి పోటీచేశారు. రెండు చోట్ల గెలవడంతో వయనాడ్‌ను వదులు కున్నారు. దీంతో ఆ స్థానం నుంచి రాహుల్‌ గాంధీ సోదరి, ప్రియాంక బరిలో దిగారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజాతీర్పును కోరారు. చట్ట సభల్లో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. 8 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి ప్రియాంక గాంధీ 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్యన్‌ మొకేరీ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరిలో ఎవరూ ప్రియాంకకు దరిదాపులో కూడా లేరు.

    అన్న రికార్డు బద్ధలు కొట్టేనా..
    వయనాడ్‌లో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ.నునీర్‌పై రాహుల్‌గాంధీ 4.3 లక్షల మెజారిటీతో రాహుల్‌గాంధీ విజయం సాధించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరోమారు వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్‌ సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.6 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రియాంక 2 లక్షలకు పైగా మెజారిటీ సాధించారు. ఇంకా కౌంటింగ్‌ సాగం కూడా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఆమె అన్న మెజారిటీని దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.

    మూడోస్థానంలో బీజేపీ..
    ఇక వయనాడ్‌లో విజయం సాధిస్తామని మొదట ధీమా వ్యక్తం చేసిన నవ్య హరిదాస్‌ కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్‌ మొకేరీ రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఇద్దరిలో ఎవరూ ప్రియాంక గాంధీకి సమీపం దూరంలో కూడా లేరు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రియాంక మెజారిటీపైనే ఉంది.