https://oktelugu.com/

AP Metro Projects : ఏపీ మెట్రో ప్రాజెక్టులు.. కేంద్రం అంగీకరిస్తుందా?

విభజన హామీలు చాలా వరకు అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటుతోంది. కొన్ని కీలక అంశాల్లో ఇంకా జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా మెట్రో రైలు ప్రాజెక్టుల విషయంలో ప్రతిపాదనలు పట్టాలెక్కడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : November 23, 2024 12:27 pm
    AP Metro Projects

    AP Metro Projects

    Follow us on

    AP Metro Projects : ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదారంగా సాయం చేస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టుకు అండగా నిలుస్తోంది. అమరావతికి అనుసంధానంగా రహదారులు, రైల్వే లైన్ నిర్మాణాలకు సైతం ముందుకు వచ్చింది కేంద్రం. ఈ తరుణంలో ఏపీ నుంచి మరో ప్రతిపాదన కేంద్రానికి వెళ్ళింది. విజయవాడ, విశాఖ మెట్రో డిపిఆర్ కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదే సమయంలో కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విజయవాడతోపాటు విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలన్నది ఎప్పటినుంచో ప్రణాళిక. కానీ ఇంతవరకు దానికి సాకారం కాలేదు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని భరించడం వీలుకాదు. అందుకే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు ప్రారంభించింది. ప్రాజెక్ట్ అంచనాలను కేంద్రానికి పంపించింది.

    * విభజన చట్టంలో స్పష్టంగా
    వాస్తవానికి విభజన చట్టంలోనే విజయవాడకు మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని స్పష్టంగా పొందుపరిచారు. అంటే దీనికి శత శాతం నిధులను కేంద్రమే భరించాల్సి ఉంటుంది. అయితే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాత్రం కేంద్రం విచక్షణాధికారం పై ఉంటుంది. 40 లక్షల జనాభా కలిగిన విశాఖ నగరంలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేకంగా పరిగణించే అవకాశం ఉంది. ఈ ఈ రెండు ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు.

    * ఆమోదం దక్కుతుందా
    విజయవాడతోపాటు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు దాదాపు 42,362 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా. విజయవాడలో 38.40 కిలోమీటర్లు, విశాఖలో 46.23 కిలోమీటర్ల మేర తొలిదశ పనులు చేపట్టాలని నిర్ణయించారు. మెట్రో నిర్మాణంలో రాష్ట్రంలో థర్డ్ లైన్ విధానంతో ముందుకు వెళ్ళనున్నారు. దీని ద్వారా ట్రాక్ నుంచే విద్యుత్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈగలు ఎక్కడ కనిపించవు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ తాజా ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.