KCR- RTC Charges Increased Again: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ధరలు పెంచుతోంది. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి బతుకుపై దెబ్బ కొడుతోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం మరోమారు ఆర్టీసీ చార్జీలు పెంచి తన ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తోంది. గడిచిన మూడేళ్లలో ఐదుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను తిప్పలు పెడుతోంది. దీంతో ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల బాగోగులు పట్టని సర్కారు వారి జీవితాలతోనే ఆడుకుంటోంది. ధరలు పెంచుతూ పోతోంది. దీంతో రోజురోజుకు దినదిన గండంగా మారుతోంది. వర్షాకాలం ముంచుకొస్తున్నా ఇంతవరకు రైతుబంధు డబ్బులు పడలేదు. దీంతో రైతులు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి లేక తిప్పలు పడాల్సి వస్తోంది. ఆదాయం లేకపోవడంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతున్నా ఇతర రాష్ట్రాల రైతులకు సాయం చేస్తూ మన రాష్ట్ర రైతులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతుల గురించి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
రాష్ట్రంలో వారం రోజులుగా రెండు అత్యాచారాలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ , కార్ఖానా ప్రాంతాల్లో బాలికలపై లైంగిక దాడులు జరగడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. నిందితులకు ప్రభుత్వమే కొమ్ముకాస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి కేటీఆర్ రేప్ లో పాల్గొన్న వారు మైనర్లు అయినా మేజర్లుగా పరిగణించి శిక్షలు ఖరారు చేయాలని వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో రాష్ర్టంలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు చేయగా ఆయనపై కేసు నమోదు చేయించింది. అటు కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ కూడా ప్రభుత్వ నిర్వాకంపై దుమ్మెత్తి పోస్తున్నాయి.
నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో నూనె ప్యాకెట్ ధర రూ. 205కు చేరడంతో సామాన్యుడి బతుకు బరువవుతోంది. ఏం కొనాలో ఏం తినాలో కూడా అర్థం కావడం లేదు. ధరలు ఇలా పెరిగితే బతుకు బండి నడిచేదెట్ల అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం విధానాలతో అన్ని రంగాలు అదుపు తప్పాయి. ఫలితంగా ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు.
ప్రభుత్వం మాత్రం ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై బీజేపీ మరోమార ఉద్యమం చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరబాద్ లోని జూబ్లీ బస్టాండ్ లో ప్రజలను కలిసి వారి ఆవేదన తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆర్టీస చార్జీలు పెంచడంతో తమకు భారంగా మారిందని వాపోతున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టి త్వరలో కుటుంబ పాలనకు చెక్ పెడతామని భరోసా కల్పించారు.
Also Read:Pawan Kalyan Former Look: ఈ లుక్ చాలు పవన్ కళ్యాణ్ ఎంత రైతు పక్షపాతో తెలుస్తుంది!