Vikram Effect On Major Collections: కమల్ హాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా పై విడుదల కి ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాయి..ఇక విడుదల తర్వాత అయితే ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కమల్ హాసన్ కి గత పదేళ్ల నుండి ఏ సినిమాకి కూడా రాలేదు అనే చెప్పాలి..ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే సౌత్ ఇండియా లో ప్రతి భాషలో కూడా మొదటి రోజు నుండి నేటి వరుకు థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనం ఇస్తూనే ఉన్నాయి..ఇప్పటి వరుకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి దాపుగా 230 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఇక తెలుగు లో కూడా ఈ సినిమా మొదటి రోజు నుండి నేటి వరుకు వసూళ్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యేలా చేస్తుంది.
Also Read: Pawan Kalyan Former Look: ఈ లుక్ చాలు పవన్ కళ్యాణ్ ఎంత రైతు పక్షపాతో తెలిస్తుంది!
ఇక ఈ సినిమా తో పాటుగా తెలుగు లో మరో భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న మేజర్ కూడా
అదే రోజు విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా..అడవి శేష్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమాకి కూడా మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది..ఓపెనింగ్ వీకెండ్ మొత్తం ఈ సినిమాకి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి..తెలుగు లో ఈ సినిమాకి తొలి వీకెండ్ విక్రమ్ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి..కానీ వర్కింగ్ డేస్ లో మాత్రం ఈ సినిమాకి విక్రమ్ తో పోలిస్తే చాలా తక్కువ వసూళ్లు వస్తున్నాయి..విక్రమ్ కి మొదటి రోజు నుండి స్టడీ కలెక్షన్స్ వస్తుండగా మేజర్ సినిమాకి మాత్రం రోజు రోజు కి కలెక్షన్స్ తగ్గుతూపోతున్నాయి..దీనిని బట్టి అర్థం అవుతున్నది ఏమిటి అంటే విక్రమ్ సినిమా ప్రభావం, మేజర్ పై చాలా గట్టిగా పడింది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ప్రస్తుతం విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ మేనియా ని తట్టుకొని ఒక్క సినిమా విజయం సాధించడం అంటే మాములు విషయం కాదు..ఈరోజు న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంటే సుందరానికి అనే సినిమా విడుదల అయ్యింది..ఈ సినిమా అయినా విక్రమ్ జోరు ని అధిగమించి మంచి వసూళ్లను రాబడుతుందో లేదో చూడాలి.
Also Read: KCR Meeting With Ministers: సడెన్ గా మంత్రులతో కేసీఆర్ భేటి.. ఈసారి ఏం జరుగుతుందో?