Nayantara – Vignesh: ఎన్నో సంవత్సరాల నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ చేస్తున్న నయనతార మరియు విగ్నేష్ ఎట్టకేలకు నిన్న అతిరధ మహారధుల సమక్షం లో వేద మంత్రాలతో అంగరంగ వైభవం గా పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరు డేటింగ్ లో ఉంటున్న సమయం లో సోషల్ మీడియా లో వీళ్లిద్దరి గురించి రోజు ఎదో ఒక్క వార్త ప్రచారం అవుతూనే ఉన్నింది..అయితే ఆ వార్తలు అన్నిటికి చెక్ పెడుతూ నిన్న వీళ్లిద్దరు ఒక్కటి అయ్యారు..ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసిన ఈ జంటకి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి..కానీ అభిమానులు వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన వీడియోలు ఎంత వెతికినా కూడా దొరకడం లేదు..దానికి కారణం వీళ్ళ పెళ్లి వీడియో రైట్స్ మొత్తం నెట్ ఫ్లిక్స్ కి దాదాపుగా 25 కోట్ల రూపాయలకు అమ్మడమే..వీళ్ళ పెళ్లి వీడియో అభిమానులు చూడాలనుకుంటే నెఫ్ట్ ఫ్లిక్స్ లో లాగిన్ అవ్వాల్సిందే.. ఇది కాసేపు పక్కన పెడితే పెళ్లి రోజు ఈ జంట చేసిన ఒక్క అద్భుతమైన కార్యక్రమం సోషల్ మీడియా లో నెటిజెన్ల చేత ప్రశంసల వర్షం కురిసేలా చేస్తుంది.

Also Read: Balakrishna- Sridevi: శ్రీదేవితో బాలయ్య ఎందుకు జతకట్టలేదు.. సీనియర్ ఎన్టీఆర్ మాట తీసుకున్నాడా?
అదేమిటి అంటే పెళ్లి రోజు ఈ ఇద్దరు ఏకంగా లక్షమంది అనాధ పిల్లలకు ఉచ్చితంగా కడుపునిండా భోజనం పెట్టించారు అట..పెళ్లి రోజు నాడు హంగులు ఆర్భాటాలు చెయ్యడం మాత్రమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా చెయ్యడం నిజంగా చాలా గ్రేట్ అంటూ సోషల్ మీడియా లో ఈ జంట పై ప్రశంసల వర్షం కురుస్తుంది.. ఇక పెళ్లి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకోవాల్సి వస్తే మహాబలిపురం లోని ఒక్క రిసార్ట్ లో హిందూ సంప్రదాయాలతో ఘనంగా ఈ పెళ్లి జరిగింది..ఈ పెళ్ళికి టాలీవుడ్ మరియు కోలీవుడ్ సినీ నటులే కాకుండా బాలీవుడ్ కి చెందిన ప్రముఖులు కూడా హాజరు అయ్యారు..కేవలం సినీ నటులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు అయ్యి నయనతార – విగ్నేష్ జంటని ఆశీర్వదించారు..ఎన్నో ఊహించని మలుపులతో సాగిన నయనతార జీవితం ఎట్టకేలకు విగ్నేష్ తో ఒక్కటి అయ్యింది..ఇది ఇలా ఉండగా నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది అట..పెళ్లి కి ముందు తన భర్త విగ్నేష్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి మరియు సమంత లతో కలిసి కన్మణి రాంబో ఖతీజా అనే సినిమాలో నటించింది..ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది..ప్రస్తుతం నయనతార షారుఖ్ ఖాన్ మరియు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే.
[…] Also Read: Nayantara – Vignesh: పెళ్లి రోజు తమ గొప్ప మనసుని చ… […]