Homeజాతీయ వార్తలుRS Praveen Kumar: హకీం పేట కీచకుడికి ఆ మంత్రి అండదండలు: ఆర్ ఎస్ ప్రవీణ్...

RS Praveen Kumar: హకీం పేట కీచకుడికి ఆ మంత్రి అండదండలు: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బయటపెట్టిన సంచలనాలు

RS Praveen Kumar: ” ఒక వెటర్నరీ డాక్టర్ కు హకీం పేట స్పోర్ట్స్ స్కూల్ లో ఏం పని? ఈ దుండగుడు ఎవరో డాక్టర్ హరికృష్ణ అని అందరూ అంటున్నారు. ఈయనను పశుసంవర్ధక శాఖ నుంచి క్రీడా శాఖకు ఎవరు బదిలీ చేశారు? దేనికోసం బదిలీ చేశారు. ఈయన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడనేనా క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇతనికి 2025 దాకా డిప్యూటేషన్ ఇచ్చిండు? హరికృష్ణ_శ్రీనివాస్ గౌడ్ మంత్రి వ్యవహారాల మీద లోతైన విచారణ జరిపి కీచకుడిని వెంటనే అరెస్టు చేయాలి. బాధిత బిడ్డలకు కేసీఆర్ కు మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అర్జెంటుగా భర్త చేయాలె. మీ పిల్లలకు ఒక న్యాయం, మా పేద పిల్లలకు ఒక న్యాయం ఉండదు.. తెలంగాణ ను మరో మణి పూర్ గా మార్చకండి” ఇదీ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్. ప్రధాన మీడియా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్న బాగోతం మీద పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానిని బాగానే తవ్వినట్టున్నారు.

ఈ స్పోర్ట్స్ స్కూల్లో హరికృష్ణ ఏళ్ళుగా పాతుకుపోయినట్టు అక్కడ పని చేసి బయటకు వచ్చిన ఉద్యోగులు అంటున్నారు. అక్కడ పనిచేసే ఒక మహిళా ఉద్యోగి తో హరి కృష్ణ యవ్వారం నడుపుతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. పశుసంవర్ధక శాఖలో డాక్టర్ గా పనిచేసే ఈయన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో పశు సంవర్ధక శాఖ నుంచి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ కు డిప్యూటేషన్ మీద వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈయనకు శ్రీనివాస్ గౌడ్ అండదండలు అందించడంతో ఇష్టానుసారంగా చెలరేగిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. కేవలం అక్కడ శిక్షణ పొందే విద్యార్థులను మాత్రమే కాకుండా మహిళా ఉద్యోగులపై కూడా హరికృష్ణ కన్నేశాడని, పెయిన్ బామ్ తీసుకురావాలని చెప్పి రాత్రుళ్ళు వేధించే వాడని సమాచారం. హరికృష్ణ బాగోతాలపై వెల్లువలా నిజాలు బయటికి రావడంతో ప్రభుత్వం మేల్కొని చర్యలకు సిఫారసు చేసిందని క్రీడాకారులు అంటున్నారు. వైపు బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ కూడా ఈ వ్యవహారం మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం చర్చనీయాంశంగా మారింది.

కవిత చెబితేనే..

హరికృష్ణ వ్యవహారం మీద వెల్లువలా నిజాలు బయటికి పొక్కడంతో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ స్పందించారు.. ట్విట్టర్ వేదికగా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో హరికృష్ణ ఉన్న ఫోటో ను ట్వీట్ చేశారు. దీంతో ఇది ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత స్పందించారు. చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ ను ట్విట్టర్ వేదికగా కోరారు. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ కవిత చెప్పేదాకా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించకపోవడం పట్ల నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్థానంలో మీ పిల్లలు ఉంటే ఇలానే చేస్తారంటూ ఆయనను ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి హరికృష్ణ వ్యవహారం తెలంగాణను ఒక కుదుపు కుదుపుతోంది. సస్పెన్షన్ చేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ.. ఆ వ్యవహారం మొత్తం శ్రీనివాస్ గౌడ్ కు తెలిసే జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిపై మంత్రి ఎటువంటి సమాధానం చెప్తారో వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular