Homeఆంధ్రప్రదేశ్‌Super El Nino 2026 India: సూపర్ ఎల్ నినో.. శతాబ్ద కాలంలో లేనంత దుర్భిక్షం.....

Super El Nino 2026 India: సూపర్ ఎల్ నినో.. శతాబ్ద కాలంలో లేనంత దుర్భిక్షం.. దేశానికి గట్టి హెచ్చరిక

Super El Nino 2026 India: గత ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురిసాయి. పంటలు సమృద్ధిగా పండాయి. కానీ ఈ ఏడాది అలా పరిస్థితి ఉండదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా.. 2026 లో అత్యంత బలమైన ఎల్ నినో పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వర్షాకాలం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది రైతులకు అత్యంత కష్టతరంగా మారబోతోందన్న హెచ్చరికలు వస్తున్నాయి. అయితే ముందుగానే ఈ హెచ్చరికలు వచ్చాయి. కానీ ఎల్ నినో ప్రభావం ఈ స్థాయిలో ఉండబోతుంది అని తెలుస్తుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

* తీవ్ర ఉష్ణ మండల వాతావరణం..
కొన్ని ప్రాథమిక విశ్లేషణల ప్రకారం ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అర్థమవుతోంది. ఈ శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన ఉష్ణ మండల వాతావరణం నమోదయ్యే ప్రమాదం ఉంది. రుతుపవనాల గమనాన్ని అస్తవ్యస్తం చేసి.. వర్షాలు పడకుండా చేస్తోందని తెలుస్తోంది. వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రభావం ఉన్న ప్రతిసారి మన దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అటువంటిది ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ఉంటుందని తెలియడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. సుదీర్ఘమైన కరువు కాటకాలకు దారి తీయవచ్చు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చే నైరుతి రుతుపవనాలను ఎల్ నినో నాశనం చేస్తుందని చెబుతున్నారు. వర్షాలు సరిగ్గా పడక తీవ్ర దుర్భిక్షం ఏర్పడుతుందని.. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గి.. భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని.. రైతాంగం తీవ్ర పెట్టుబడి నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరికలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

* భారీగా ఉష్ణోగ్రతలు..
ఒక్క వర్షాభావ పరిస్థితులే కాదు.. దేశవ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అసాధారణ రీతిలో పెరుగుతాయని సంకేతాలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయరంగం పూర్తిగా దెబ్బతింటే ఆ ప్రభావం దేశం పై పడుతుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మన దేశ చరిత్రను గమనిస్తే.. ఎక్కువ శాతం కరువులు ఎల్ నినో సమయంలో సంభవించినవే. 2009లో అత్యంత తీవ్రమైన ఎల్ నినో కారణంగా దేశంలో అంతకుముందు 30 ఏళ్లలో లేనంతగా.. 22 శాతం వర్షపాతం తగ్గింది. దీనికి కారణంగా దేశవ్యాప్త కరువుకు దారితీసింది. 2014 నుంచి 2016 మధ్య ఎల్ నినో ప్రభావంతో వరుసగా రెండు సంవత్సరాలు వర్షాలు తగ్గి వ్యవసాయరంగం తీవ్రంగా నష్టపోయింది. 2023 లో కూడా ఎల్ నినో ప్రభావంతో ఆగస్టు నెలలో వందేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదయింది.. అయితే ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ఉంటుందని తెలియడంతో తీవ్ర దుర్భిక్షం తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper