ప్రస్తుత కాలంలో యువతకు యాక్టింగ్ అంటే ఫ్యాషన్ గామారింది. టీవీ.. యూట్యూబ్ లో కనిపించాలనే ఆశ పెరిగిపోయింది. ఒక్కసారైనా టీవీలో కనిపించాలని ఎన్నో కష్టాలు.. ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో బుల్లితెర.. వెండితెరపై ఆసక్తి ఉన్న ఓ మహిళ తాను యాంకర్ గా కనిపించేందుకు రూ.25 లక్షలు అప్పగించేసింది. మోసం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకోగా.. సదరు వ్యక్తి ఇప్పటికే చాలా మంది దగ్గర ఇలాంటి వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడైంది.
Also Read: తరగని నీటి జ్వాల.. ‘కాళేశ్వరం’ రికార్డు
ఏపీలోని విజయవాడ భవానీపురానికి చెందిన కోనాల అచ్చిరెడ్డి మోసగించడమే వృత్తిగా బతుకుతున్నాడు. బాగా డబ్బు ఉన్నవాళ్ల అవసరాలను, ఆకాంక్షలను పసిగడుతూ.. వారిని ఎలాగోలా బుట్టలో వేసుకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో ఓ కేసు విషయంలో అతడు పోలీసులకు పట్టుపట్టాడు. తెలంగాణలోని నల్లగొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన సమ్మినేని సాయికి ఉద్యోగం ఇప్పిస్తానని అచ్చిరెడ్డి నమ్మబలికాడు. సాయి నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసి ముఖం చాటేశాడు. దీంతో అచ్చిరెడ్డి చేతిలో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అచ్చిరెడ్డిని పోలీసుల అరెస్టు చేశారు. తమదైన శైలిలో విచారించగా.. అతడు చేసిన మోసాలను ఒక్కొక్కటిగా వెల్లడించాడు.
నల్లగొండలో జ్యోతిష్యం పేరిట మరో వ్యక్తి దగ్గర రూ.4లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఖమ్మం కు చెందిన ఓ మహిళకు సాఫ్ట్ వేర్ కంపెనీలో వాటా ఇస్తానని రూ.50 లక్షలు తీసుకున్నాడు. తరువాత అచ్చిరెడ్డి నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో గత ఏడాది ఖమ్మం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఖమ్మం పట్టణానికి చెందిన మరో మహిళకు రైల్వేలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.20 లక్షలు తీసుకున్నాడు.తరువాత పత్తా లేకుండా పోయాడు. ఈ మోసంపై విజయవాడలోని భవానీ పురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
Also Read: అడ్డంగా దొరికిన బీజేపీ నేత.. షాక్ లో ముఖ్య నేతలు
విజయవాడకు చెందిన ఓ మహిళ యాంకరింగ్ పై మోజు పెంచుకుంది. దీంతో ఎలాగైనా బుల్లితెరపై కనిపించాలనే ఆమె కోరికను నెరవేరుస్తానని అచ్చిరెడ్డి ముందుకొచ్చాడు. ఓ ప్రముఖ చానల్లో యాంకర్ గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి రూ.25 లక్షలు వసూలు చేశాడు. చివరికి మోసపోయానని గ్రహించిన మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయంచింది. దీంతో భవానీ పురం పోలీసు స్టేషన్ లోనే మరో కేసు అచ్చిరెడ్డిపై నమోదు అయ్యింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్