
ఈ వేసవిలో క్రికెట్ పండుగ దేశంలో జరగబోతోంది. ఐపీఎల్ 2021 లీగ్ కు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. కరోనా కల్లోలం దృష్ట్యా ఈసారి కఠిన నిబంధనలతో టోర్నీ నిర్వహిస్తున్నారు.
అన్ని జట్లను ఒకే సిటీలో ఉంచి బయోబబుల్ ఏర్పాటు చేసి మ్యాచ్ లు ఆడియో యోచనలో బీసీసీఐ ఉంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఐదు నగరాలను బీసీసీఐ ఎంపిక చేసినట్టు టాక్ నడుస్తోంది.
ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, ముంబై, చెన్నైలలో లీగ్ మ్యాచ్ లను.. అహ్మదాబాద్ ను ప్లేఆఫ్స్ కు ఎంపిక చేసినట్టు బీసీసీఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
అయితే హైదరాబాద్ కు ఐపీఎల్ నిర్వహణకు అవకాశం ఇవ్వకపోవడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులకు ట్వీట్ చేశారు. దేశంలోనే అతి తక్కువ కరోనా కేసులు హైదరాబాద్ లో నమోదవుతున్నాయని.. కాబట్టి హైదరాబాద్ ను కూడా ఐపీఎల్ నిర్వహణకు వినియోగించుకోవాలని బీసీసీఐని ట్యాగ్ చేస్తూ మంత్రి కేటీఆర్ కోరాడు. తమ ప్రభుత్వం లీగ్ నిర్వహణకు సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సన్ రైజర్స్ టీం హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అభిమానుల కోసం కేటీఆర్ ఈ కోరిక కోరాడు.
ఇక మంత్రి కేటీఆర్ అభ్యర్థనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ మద్దతు తెలిపారు. హైదరాబాద్ కు ఐపీఎల్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరారు.
Comments are closed.