RRR Ticket Prices: ‘ఆర్ఆర్ఆర్’.. తెలుగు ప్రజలే కాదు..యావత్ భారతదేశం ఆసక్తిగా చూస్తున్న ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూద్దాం అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ ను మొదలుపెట్టి రాజమౌళి పతాకస్థాయికి తీసుకెళ్లారు. ఇక ఏపీలోనూ సీఎం జగన్ ను కలిసి సినిమా టికెట్ రేటును పెంచుకున్నారు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతోనూ మాట్లాడి ఆర్ఆర్ఆర్ టీం వరాలు కురిపించుకుంది. అయితే రాజమౌళి అండ్ టీం దీనిపై ఆనందంగా ఉన్నా ప్రేక్షకులు మాత్రం షాక్ కు గురవుతున్నారు. తెలంగాణలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచారు. ఈ మేరకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.
Also Read: Telangana BJP: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?
మార్చి 25 నుంచి 27 వరకూ సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో రూ.50, 28 నుంచి ఏప్రిల్ 3 వరకూ రూ.30 ధరను పెంచుకోవచ్చు.
ఇక మల్టీప్లెక్స్ లలో 25 నుంచి 27వరకూ రూ.100, 28 నుంచి ఏప్రిల్ 3 వరకూ రూ.50 పెంచుకోవచ్చు. ఏప్రిల్ 3 వరకూ రోజుకు 5 షోలు వేసుకోవచ్చు. దీంతో తొలి 3 రోజుల్లోనే టికెట్ ధరలు మల్టీప్లెక్స్ లలో 350, థియేటర్లలో రూ.225 కానున్నాయి.
ఆర్ఆర్ఆర్ టికెట్ ధరలు చూసి మూవీ టీం సంబరపడుతున్నా.. సినిమా చూసే ప్రేక్షకులు మాత్రం ఇదేం బాదుడురా స్వామి అంటూ తలపట్టుకుంటున్నారు.
Also Read: PM Narendra Modi: గ్లోబల్ లీడర్ గా మోడీ.. మరో రికార్డ్