Best 50+ Friendship Quotes and Quotation in Telugu నిజం మనిషిని నిలబెడుతుంది.. స్వచ్ఛమైన జీవితాన్నిస్తుంది.. మంచీ చెడులను తెలుపుతుంది. మరి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు..? ఎల్లప్పుడూ మంచినే కోరుకుంటాడు. మన శ్రేయస్సు కోసం పరితపిస్తుంటాడు. నిజమైన స్నేహితుడు దొరకడం వారి అదృష్టం. ఎందుకంటే ఆపదలో ఆదుకునే ఒకే ఒక వ్యక్తి స్నేహితుడు. నువ్వేం చేసినా భరించేది ఆ ఒక్క వ్కక్తే. నువ్వు తప్పు Heart touching Friendship Quotes in Telugu చేసినా సరైన మార్గంలో నడిపించేది ఆ ఒక్క వ్యక్తే. అయితే మంచి స్నేహితుడు ఎలా ఉంటాడు..? అతడిని కనుక్కోవడం ఎలా..? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే కాలక్రమంలో మనకు ఓ మంచి స్నేహితుడు దొరికితే అతనికి మనమిచ్చే గిప్ట్ ఏంటి..? ఒక చిన్న మెసేజ్.. ఒక్క మెసేజ్ తో అతని మనసు ఎంతో ఉల్లాసంగా మారుతుంది. అలాంటి మెసేజ్ లు మీకోసం..
‘ప్రపంచం నిన్ను దూరం చేసినా.. నిజమైన స్నేహితుడు నిన్నే చేరదిస్తాడు..’
‘ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప బహముతి అంటే నిజమైన స్నేహితుడే.. అది లభించిన వారు అదృష్ట వంతులే..’
‘మంచి స్నేహితుడు తన మిత్రుడిలోని ఉత్తమమైన లక్షణాలను గుర్తిస్తాడు..’
‘నిజమైన స్నేహం ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగినప్పుడు.. ఆ సమయంలో నిశ్భద్దం ఏర్పడుతుంది..’
‘ఒక స్నేహితుడిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావడానికి నిజమైన స్నేహితుడు ప్రయత్నిస్తాడు’
‘మీ జీవితంలో.. మీతోని ఎవరు ఎక్కువ కాలం నడుస్తారో.. వారే నిజమైన స్నేహితులు’..
‘మీ ముహంలోని చిరునవ్వును కాకుండా.. మీ కళ్లల్లోని బాధను గుర్తించినవాడే నిజమైన స్నేహితుడు’
‘నిజమైన స్నేహితుడి కోసం చేయగలిగింది.. అతనితో జీవితాంతం కలిసి ఉండడమే..’
‘ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. అర్థం చేసుకోబడడం..నిజమైన స్నేహానికున్న అర్థం’
Also Read: Chinajiyar Swamy: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్
‘మీకు జబ్బు చేసినప్పుడు నిజమైన స్నేహితుడు మీ వెంట ఉంటే.. అదే అసలైన చికిత్స’
‘మీలోని లోపాన్ని చూపించేవాడు నిజమైన స్నేహితుడు.. ఆ సమయంలో ధైర్యం కూడా చెబుతాడు’..
‘బాధల్లో కూడా మిమ్మల్ని నవ్వించేవాడు.. నిజమైన స్నేహితుడు’
‘జీతితంలో కొందరికి మాత్రమే ప్రతి దశలో నిజమైన స్నేహితుడు తారసపడుతాడు’
‘నిజమైన స్నేహం కంటే విలువైనది ఈ భూమ్మీద ఏదీ లేదు’
‘నిజమైన స్నేహితుడిని మోసం చేయొద్దు.. చేసినా అతడు క్షమిస్తాడు’..
‘స్నేహం అనేది దారం లాంటిది.. దానిని తెగిపోకుండా కాపాడుకునే బాధ్యత ఎదుటి వ్యక్తిపై ఉంది’
‘బాధపడుతున్న వ్యక్తి పక్కన నిశ్శబ్దంగా కూర్చోవడమే..మనం నిజమైన స్నేహితుడికిచ్చే ఉత్తమమైన బహుమతి’
‘అసలైన స్నేహితులు తమ ప్రేమను కష్ట సమయాల్లో చూపిస్తారు’
‘జీవితంలో ఎక్కువ సమయం నీతో ఉన్నవాడు.. నిజమైన స్నేహితుడు.. తక్కువ సమయంలో ఉన్నా.. అర్థం చేసుకుంటాడు..’
‘నీకు సమస్య వచ్చినప్పుడు నీతో ఉండేవాడు.. నీ సమస్యలను తొలగించేవాడు నిజమైన స్నేహితుడు’
Also Read: TDP Twitter Account Hacked: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులతో షాకిచ్చిన హ్యాకర్లు