Homeజాతీయ వార్తలుRock-Cut Caves In India: భారత్ లో మరో గొప్ప నాగరికత బయటపడింది

Rock-Cut Caves In India: భారత్ లో మరో గొప్ప నాగరికత బయటపడింది

Rock-Cut Caves In India: భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. వేల ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఇక్కడ నిక్షిప్తమై ఉంది. పురాతకాలంలో భారత్ లో ఎటువంటి జీవనం చేసేవారో.. ఎటువంటి అలవాట్లు ఉండేవో ఇప్పటికే చాలా మంది శాస్త్రవేత్తలు పలు విధాలుగా కనుగొన్నారు. కొన్నింటిని తవ్వకాల్లో బయటకు తీసి ప్రపంచానికి తెలియజెప్పి ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. తాజాగా జరిపిన పరిశోధనల్లో మరికొన్ని ఆసక్తికరమైన వస్తువులు, అవశేషాలు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్ లోని బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ లో కొన్ని అవశేషాలు బయటపడడంతో అప్పటి జీవన విధానం ఎలా ఎందో శాస్త్రవేత్తలు ప్రపంచానికి చెబుతున్నారు.

మధ్యప్రదేశ్ లోని రాక్ -కట్ గుహ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఒకప్పుడు మానవ కార్యకలాపాలు జరిగాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గుహలు ప్రకృతి పరంగా ఏర్పడలేదని, మానవ జీవనం కోసం సృష్టించబడ్డాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ గుహల్లో వేల సంవత్సరాల నాటి కింది జీవన విధానం తెలియజేస్తూ పెయింటింగ్ లు వేసి ఉన్నాయి. దీనిని భట్టి అక్కడ కొందరు మనుషులు జీవించేవారని, వారే తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించారని తెలుస్తోంది.

అర్కియోలాజికల్ ఆఫ్ ఇండియా ప్రకారం బాంధవ్ ఘర్ ఒకప్పుడు వాణిజ్య నగరంగా ఉండేదని తెలుస్తోంది. చాలా మంది ప్రయాణికులు రాక్ -కట్ షెల్టర్ గుండా రాకపోకలు సాగించేవరని తెలిపారు. ఇక్కడ వేసిన ఓపెయింటింగ్ ను నిశితంగా పరిశీలిస్తే ఇది 1500 సంవత్సరాల నాటిదని తెలుస్తోందని అర్కియోలాజికల్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఆధునిక నాగరికత ప్రారంభమైన తరువాత మధ్యప్రదేశ్ లో ఈ పెయింట్ వేసినట్లు కనుగొన్నామని అంటున్నారు. వాళ్లు వేసిన పెయింటింగ్ లో ఓ జంతువునుకూడా వేశారని తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా మానవ నిర్మిత జలవనరులను కూడా ఈ పరిశోధనలో కనుగొన్నట్లు అర్కియాలజీ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అప్పటి సమాజంలో ప్రజలకు నీటి అవసరాన్ని తీర్చేందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించేవారని తెలుస్తోందని అన్నారు. ఆ కాలంలోనే చేపలు పట్టడం, నీటిపై రవాణా మార్గాలు ఏర్పాటు చేసుకోవడం వంటికి ఈ జలవనురుల్లో చేశారని అంటున్నారు. ఈ నీటి వనరులు సుమారు 1800-2000 నాటి సంవత్సరాల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోందని అన్నారు.

ఈ నిర్మాణాలన్నీ రాతి రూపంలో ఉండడంతో ఇవి బుద్దుడి కాలంలో నిర్మించినట్లు తెలుస్తోందని అంటున్నారు. ఆ కాలంలో వ్యాపారులు , ప్రజలు రాతితో చేయబడిన పనిముట్లను వాడేడారని, వీటిని పరిశీలిస్తే ఆ కాలం నాటివేనని అర్థమవుతోందని శాస్త్రవేత్తుల పేర్కొంటున్నారు. క్రీస్తు శకం 2వ -5వ శతాబ్దానికి చెందిన మొత్తం 24 బ్రహ్మీ శాసనాలు 2022లో వెలుగు చూశాయని వీటిలో రాక్-కట్ గుహలు కనుగొన్నట్లు తెలిపారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular