Rajinikanth Daughters: సూపర్ స్టార్ రజనీకాంత్ కూతుళ్లను దొంగలు టార్గెట్ చేశారు. ఇటీవల అక్క ఇంట్లో దొంగతనం జరగగా తాజాగా చెల్లెలు వస్తువులను చోరీ చేశారు. వరుసగా రజనీ కూతుళ్లను ఇంటా, బయటా దొంగలు ఫాలో చేయడం హాట్ టాపిగ్గా మారింది. తమిళనాడు చర్చనీయాంశంగా మారడంతో పకడ్బందీగా దోచుకెళ్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
రజనీ చిన్న కూతరు సౌందర్య తన ఎస్‌యూవీ కారు దొంగతనానికి గురైనట్లు చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేటు కళాశాలలో ఫంక్షన్ కు హాజరైన ఆమె కొన్ని గంటల తరువాత తిరుగు ప్రయాణానికి కారు వద్దకు రాగా, కనబడ లేదు. తాళాలు కూడా మాయమవడంతో అవాక్కయ్యింది. అక్కడున్న వారిని విచారించగా, తమకు తెలీదని సమాధానం రావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
కాగా, ఇటీవల రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో దొంగలుపడ్డారు. రూ.60 లక్షలు విలువ చేసే వస్తువులు దోచుకొని వెళ్లిపోయారు. ఎంతో పకడ్బందీగా ఇంట్లో చోరీ జరగడంపై లోపలి వ్యక్తులపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. తన ఇంట్లో పని చేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్‌లు ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. దోచుకెళ్లిన రూ.60 లక్షలు విలువ చేసే వస్తువులను రికవరీ చేశారు.
రజనీ కూతుళ్లకు చెందిన వస్తువులు వరుసగా చోరీలు జరగడం చర్చనీయాంశంగా మారింది. చిన్న కూతరు కారును ఇంకా రివకరీ చేయలేదు. చెన్నైలో రజనీకి అభిమానులు ఎక్కువ. వారంతా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. దొంగను పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఏ వస్తువును దోచుకెళ్తారోనని ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.