Homeజాతీయ వార్తలుKarnataka Election Results : కర్నాటక ఫలితాలు.. దేశ రాజకీయాలను ఎలా మార్చబోతున్నాయి?

Karnataka Election Results : కర్నాటక ఫలితాలు.. దేశ రాజకీయాలను ఎలా మార్చబోతున్నాయి?

Karnataka Election Results : బీజేపీ హవాకు దక్షణాది రాష్ట్రం చెక్ చెప్పనుందా? వరుస విజయాలతో దూసుకుపోతున్న కాషాయదళానికి బ్రేక్ పడనుందా? ప్రాంతీయ పార్టీ కబళింపు రాజకీయాలకు కర్నాటక వేదిక కానుందా? అధికారానికి ఆమడదూరంలో ఉండిపోనుందా? హంగ్ అయితే కింగ్ ఎవరు? కింగ్ మేకర్ ఎవరు? ఇప్పుడు యావత్ భారతావనిని తొలుస్తున్న ప్రశ్న ఇది. కర్నాటక ఫలితాలు దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలవనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ హంగ్ సంకేతాలతో కర్నాటక రాజకీయం రసకందాయంలో పడింది. శనివారం నాడు వెల్లడయ్యే ఫలితాలపై మరింత అంచనాలు పెరిగాయి.

గెలిస్తే.. అదే ఊపు..
కర్ణాటకలో బీజేపీ విజయం సాధిస్తే మోదీ, షా ద్వయం తన విజయపరంపర కొనసాగిస్తుంది. దేశ రాజకీయాల్లో బీజేపీ అతీతమైన శక్తిగా మారనుంది. అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగితే మాత్రం బీజేపీకి కష్టాలు ప్రారంభమవుతాయి. కాంగ్రెస్ కు జవసత్వాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ధైర్యం పోగుచేసుకొని పొలిటికల్ లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది.  కర్నాటక ఫలితాలు ప్రతికూలంగా వస్తే మాత్రం… అది బీజేపీ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ పడినట్టే. అందుకే ఈ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకం. తరువాత తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై కన్నడిగులు కచ్చితంగా ప్రభావం చూపుతారు.

ఐక్య పోరాటాలతో కాంగ్రెస్..
అయితే ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం నడిచింది. బీజేపీకి ప్రతికూల అంశాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ ఇట్టే మ్యాజిక్ ఫిగర్ ను దాటేస్తుందని అందరూ అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యపోరాటాలతో బీజేపీకి ముచ్చెమటలు పట్టించారు. కానీ పోలింగ్ తరువాత వెలువడిన ఎగ్టిజ్ పోల్స్ లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ లు రమారమి వందకు దగ్గరగా సీట్లు తెచ్చుకుంటాయని చెబుతుండడంతో హంగ్ తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా అధికారంలోకి రావడం కష్టమని చెబుతున్నాయి.

హంగ్ అయితే జేడీఎస్ కింగ్..
హంగ్ ఏర్పడితే మాత్రం డీఎస్ అపద్బాందవుడిగా మారుతుంది. అయితే గత అనుభవాల దృష్ట్యా జేడీఎస్ జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం అది మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం చూస్తే.. జేడీఎస్ కు కనీసం 20 స్థానాల్లో గెలుపొందుతుందని.. అదే జరిగితే ఆ పార్టీ కింగ్ మేకర్ గా మారుతుందంటున్నారు. అయితే.. కింగ్ మేకర్ అవసరం లేదని.. సొంతంగా గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్.. బీజేపీల్లో వ్యక్తమవుతోంది.మొత్తంగా కర్ణాటకలో కింగ్ ఎవరు? కింగ్ మేకర్ ఎవరన్న దానిపై చర్చ కొనసాగుతోంది. శనివారం మధ్యాహ్నం నాటికి దీనిపై క్లారిటీ రానుంది. అప్పటి వరకూ వెయిటింగ్ తప్పదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular