కోవిడ్-19పై పోరాటానికి ‘రోబో’ చేయూత

కరోనా(కోవిడ్-19) పేరు చెబితే ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ దాటికి అగ్రదేశాలు సైతం చేతులేత్తేశాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతోన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షల్లో మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో కరోనా పేరు చెబితేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్ ఈ మహమ్మరిపై పోరాడుతున్న కరోనా […]

Written By: Neelambaram, Updated On : July 8, 2020 2:41 pm
Follow us on


కరోనా(కోవిడ్-19) పేరు చెబితే ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ దాటికి అగ్రదేశాలు సైతం చేతులేత్తేశాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతోన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షల్లో మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో కరోనా పేరు చెబితేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్

ఈ మహమ్మరిపై పోరాడుతున్న కరోనా వారియర్స్ సైతం మృత్యువాత పడుతున్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు ఈ మహమ్మరి బారినపడుతున్నారు. కొంతమంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకుంటుండగా మరికొందరు మృత్యువాతపడుతున్నారు. కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటూ వైద్యసేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని కాపాడుకునేందుకు ప్రభుత్వాలు అన్నిరకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వారికి పీపీఈ కిట్స్, మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నారు.

కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?

వైద్య సిబ్బంది వీటన్నింటిని వినియోగిస్తున్నప్పటికీ కొందరు కరోనా బారిన పడుతున్నారు. దీంతో కరోనా పేషంట్లకు వైద్య సేవలందించేందుకు టెక్నాలజీని వాడుతున్నారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో కోవిడ్-19 రోగులకు రోబోలను వాడుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స రోగులకు ఆహారం, మంచినీళ్లు, మందులు లాంటివి అందించేందుకు ఓ రోబోటిక్ ట్రాలీని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల రోగుల వద్ద వైద్య సిబ్బంది వెళ్లకుండానే వారికి కావాల్సిన వస్తువులను అందిస్తున్నారు. ఈ ట్రాలీ పేరు గొల్లార్. ముంబయిలోని వర్లీలోని పోడార్ ఆస్పత్రిలో రోబో ట్రాలీని వాడుతున్నారు. ఈ రోబో పేషంట్లకు సేవలందిస్తున్న వీడియోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్లర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కరోనా మహ్మమరి పోరాటంలో ఈ రోబోలు మానవులకు ఎంతగానో దోహదపడుతాయని వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్ర కంటే ముందుగానే చండీగఢ్ లో ఇలాంటి రోబోటిక్ ట్రాలీని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సంస్ధ ఆవిష్కరించింది. వీరి సహకారంతో తాము రోబో ట్రాలీని వాడుతున్నామని, రూ.25వేలతో దీనిని తయారు చేసుకోవచ్చని అక్కడి వైద్యులు చెబుతున్నారు. కరోనాపై పోరాటంలో రోబోల పాత్ర కీలకంగా మారడంతో మరిన్ని రాష్ట్రాలు గోల్లార్ సేవలను వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు.

Tags