https://oktelugu.com/

ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!

ఈ మధ్య జనసేన కార్యకర్తలు అభిమానులు పవన్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారు. ఆయన నిర్ణయాలు, లేవనెత్తుతున్న అంశాలు ఆయన ఇమేజ్ ను, పార్టీ భవిష్యత్ ను కాపాడేవిగా ఉండడమే దీనికి కారణం. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా పవన్ ప్రస్తావించిన అంశాలను, ప్రతిపాదలను జగన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆయన ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇది జగన్ పై పవన్ పైచేయి సాధించడమే అని జనసైనికులు సంబరపడుతున్నారు. తాజా పరిణామం వారిలో మరింత ఉత్సాహాన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 8, 2020 / 02:29 PM IST
    Follow us on


    ఈ మధ్య జనసేన కార్యకర్తలు అభిమానులు పవన్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారు. ఆయన నిర్ణయాలు, లేవనెత్తుతున్న అంశాలు ఆయన ఇమేజ్ ను, పార్టీ భవిష్యత్ ను కాపాడేవిగా ఉండడమే దీనికి కారణం. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా పవన్ ప్రస్తావించిన అంశాలను, ప్రతిపాదలను జగన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆయన ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇది జగన్ పై పవన్ పైచేయి సాధించడమే అని జనసైనికులు సంబరపడుతున్నారు. తాజా పరిణామం వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది.

    కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్

    జులై 5వ తేదీన వైస్ ఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లా నేస్తం పథకానికి ఎందుకు నిధులు కేటాయించలేదని పవన్ ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలో ఉపాధిలేక ఇబ్బందిపడుతున్న జూనియర్ లాయర్స్ కి రావలసిన భృతి బకాయిలు విడుదల చేయాలని పవన్ ఓ లేఖ ద్వారా కోరారు. జూన్ వరకు ప్రతి నెలా జూనియర్ లాయర్లకు రావలసిన రూ. 5000 భృతిని విడుదల చేయాలని కోరడం జరిగింది. పవన్ లేఖ విడుదల చేసిన రెండు రోజులలో అనగా జులై 7న సదరు నిధులను విడుదల చేస్తూ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనితో వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, లభ్ది చేకూరేలా చేసిన పవన్ పై జూనియర్ లాయర్లకు గౌరవం పెరిగిందని జనసేన కేడర్ భావిస్తుంది.

    కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?

    అలాగే ప్రతిపక్ష హోదా లేకున్నా వ్యవస్థీకృతం గా ప్రజా సమస్యలు లేవనెత్తుతూ, వాటి పరిష్కరించే విషయంలో పవన్ విజయం సాధిస్తున్నారని జనసైనికులు భావిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు పవన్ రాజకీయ భవిష్యత్ కి మేలు చేకూర్చేవి అని వారు అభిప్రాయపడుతున్నారు. తన లెటర్స్ ద్వారా ప్రభుత్వంలో కదిలికలు తీసుకొస్తున్న పవన్… జగన్ పై ఆధిపత్యం సాదిస్తున్నట్లే అనేది జనసేన నేతల వాదన. ఈ విషయంలో పై చేయి ఎవరిది అయినా ప్రయాజనం చేకూరేది ప్రజలకే కాబట్టి ఆనందించదగ్గ విషయమే. అనవసరమైన ఊక దంపుడు ఉపన్యాసాలు వదిలేసి నేతలు ఇలాంటి చర్యలపై దృష్టిపెడితే శుభపరిణామం .