జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

అవును.. నిజంగానే ఇది సీఎం జగన్ కు టఫ్ పరీక్ష.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా పరిస్థితి ఉంది. రాజధాని కూడా లేని ఏపీని ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్న సీఎం జగన్ కు కేంద్రంలోని బీజేపీ అండ ఉంది. కేంద్రం అండతోనే జగన్ పోలవరం సహా పలు అభివృద్ధి పథకాలకు నిధులు తెచ్చుకుంటున్నారు. పార్లమెంట్ లో పలు బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం సఖ్యతతో సాగుతున్న ఈ బంధంలో అనుకోని ట్విస్ట్.. ఇప్పుడు బీజేపీతో జగన్ ఏం చేస్తారన్నది […]

Written By: NARESH, Updated On : July 8, 2020 3:10 pm
Follow us on


అవును.. నిజంగానే ఇది సీఎం జగన్ కు టఫ్ పరీక్ష.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా పరిస్థితి ఉంది. రాజధాని కూడా లేని ఏపీని ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్న సీఎం జగన్ కు కేంద్రంలోని బీజేపీ అండ ఉంది. కేంద్రం అండతోనే జగన్ పోలవరం సహా పలు అభివృద్ధి పథకాలకు నిధులు తెచ్చుకుంటున్నారు. పార్లమెంట్ లో పలు బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం సఖ్యతతో సాగుతున్న ఈ బంధంలో అనుకోని ట్విస్ట్.. ఇప్పుడు బీజేపీతో జగన్ ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.

కోవిడ్-19పై పోరాటానికి ‘రోబో’ చేయూత

కేంద్ర కేబినెట్ విస్తరణకు ప్రధాని మోడీ నిర్ణయించారు. కానీ బీహార్ ఎన్నికలు.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర కేబినెట్ లోకి బలమైన మిత్రపక్షాలైన జేడీయూ, వైసీపీని తీసుకోవాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు నిర్ణయించారట.. ఇప్పుడు అదే సీఎం జగన్ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది.

ప్రస్తుతం బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వేళైంది. ఈ క్రమంలోనే మిత్రపక్షం జేడీయూని మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ పడింది. ఇదివరకు కేంద్ర మంత్రిపదవుల్లో తమకు వాటా సరిగా ఇవ్వలేదని జేడీయూ అధినేత నితీష్ అలిగి అప్పట్లో మోడీ కేబినెట్ నుంచి వైదొలిగారు. కానీ ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇద్దరి అవసరం కావడంతో మరోసారి తప్పనిసరి పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల కోసం జట్టు కడుతున్నారు. ప్రధాని కూడా జేడీయూని కేబినెట్ లోకి తీసుకొని బీహార్ లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు.కాగా కేంద్రంలో జేడీయూతోపాటు వైసీపీకి కూడా చోటు కల్పించాలనే ఉద్దేశం బీజేపీ పెద్దలకు ఉందని సమాచారం అందుతోంది.

ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!

వైసీపీకి 23మంది ఎంపీలు, 6 రాజ్యసభ ఎంపీలున్నారు. వైసీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు.. ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిదట.. ఇప్పుడు ఇదే ఆఫర్ సీఎం జగన్ కు చెబితే మల్లాగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.

బీజేపీ ఆఫర్ ను జగన్ తీసుకోవడానికి తటపటాయిస్తున్నట్టు తెలిసింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దళితులు, మైనార్టీలు వైసీపీకి దూరం అవుతారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో అధికారం పంచుకోకూడదని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల వారు అంటున్నారు. ఈ ఆఫర్ ఇచ్చినా జగన్ సున్నితంగా తిరస్కరించే అవకాశాలే ఎక్కువంటున్నారు. పైగా ఎన్నికల వేళ కేంద్రంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేపార్టీతోనే కలుస్తానని జగన్ హామీ ఇచ్చారు. బీజేపీ ఇవ్వనని చెప్పింది. దీంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏపీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఈ ప్రతిపాదనపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరి సీఎం జగన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరుతారా? లేదా అన్నది త్వరలోనే తేలనుంది.