Drunken Driving: మద్యం తాగి వెహికల్స్ నడిపితే యాక్సిడెంట్స్ జరిగే సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపొద్దని ప్రతీ ఒక్కరు చెప్తుంటారు. ఈ విషయమై పోలీసులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అయినా కొందరు మాత్రం మారడం లేదు. పీకల దాకా మద్యం తాగి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అయితే, వారు ఇలా చేయడానికి సరైన శిక్షలు పడటం లేదనేది కారణంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు మద్యం తాగి వాహనాలు నడిపి యాక్సిడెంట్స్ చేసిన వారిని శిక్షించడంలో కోర్టు తీర్పులు ఆలస్య మవుతున్నాయా.. మద్యం తాగి వాహనాలు నడపడం వలన రోజురోజుకూ ప్రమాదాలు పెరిగే చాన్సెస్ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

మద్యం తాగి వాహనాలు నడిపన వారి సంఖ్య ఈ ఏడాది ఎంత నమోదు అయిందో తెలుసుకుందాం. తెలంగాణలోని ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 32 వేల కేసులకు 26 వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇక తెలంగాణలో దాదాపు 50 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేసినా, ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాగైతే మందుబాబుల ఆగడాలకు కళ్లెం పడేదెలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పీకల దాకా మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వలన చాలా మంది అమాయకుల ప్రాణాలు పోయాయి.
Also Read: కాపులను మోసం చేస్తుందెవరు.. ట్రెండింగ్ లో ఇద్దరు నేతలు?
సైబరాబాద్ పోలీసుల వివరాల ప్రకారం..ఈ ఏడాది ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడిపిన 280 మంది డ్రైవర్లపై 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయంలో స్పీడీ ట్రయల్స్ జరిగితేనే త్వరగా శిక్ష పడే చాన్సెస్ ఉంటాయని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఇప్పటికే కోర్టు మానిటరీ సెల్ వీటిపై స్పెషల్‌గా విచారణ చేస్తుందని పేర్కొన్నారు అధికారులు. 35 శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం తాగి వెహికల్స్ డ్రైవ్ చేయడం వల్లే జరిగాయని పోలీసు అధికారులు వివరిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్స్ సంఖ్య గతేడాదితో పోలిస్తే నాలుగు రేట్లు పెరిగింది. గతేడాది 6,588 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 25,453 కేసులు నమోదయ్యాయి. ఇందులో 10,109 కేసుల్లో ఛార్జీషీట్ దాఖలు చేశారు పోలీసులు. కాగా, ఇందులో 206 మందికి జైలు శిక్ష పడగా, 25మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. 86 మందిపై 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేసినా ఏ ఒక్కరికి ఇంకా శిక్ష పడకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో శిక్షలు కఠినతరం చేయాలని పలువురు కోరుతున్నారు.
Also Read: మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. రూ.50కే మూడేళ్ల వారంటీతో ఐదు బల్బులు!