Homeఎంటర్టైన్మెంట్Anaganaga Oka Raju OTT: ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన 'అనగనగా ఒక...

Anaganaga Oka Raju OTT: ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ‘అనగనగా ఒక రాజు ‘..ఎందులో చూడాలంటే!

Anaganaga Oka Raju OTT: ఈ సంక్రాంతి కానుకగా భారీ సినిమాలతో తలపడుతూ భారీ విజయాన్ని సాధించిన చిత్రాల్లో ఒకటి ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju). నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరో గా నటించిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సెన్సేషన్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 49 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. వంద కోట్ల గ్రాస్ మార్కుని కూడా ఈ చిత్రం అందుకొని ఉంటే బాగుండేది, కానీ సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కలెక్షన్స్ బాగా డౌన్ అయిపోయాయి. అందుకే ఈ చిత్రం వంద కోట్ల టార్గెట్ ని మిస్ అయ్యింది. అయితే దాదాపుగా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమైంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని విడుదలకు ముందే నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. నెట్ ఫ్లిక్స్ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసుకునేందుకు అనుమతి ని ఇవ్వాలి. అయితే థియేట్రికల్ రన్ ముగియడం తో రెండు రోజులు ముందుగానే ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ కే అందుబాటులోకి రానుంది. ఈ నెల 11న ఈ చిత్రం తెలుగు వెర్షన్ తో పాటు హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకోబోతుందో చూడాలి. చాలా సినిమాలు థియేటర్స్ లో సక్సెస్ సాధించి, ఓటీటీ లో ఆడియన్స్ ని అలరించడంలో విఫలం అవుతుంటాయి.

ఈ సినిమా కూడా ఆ కోవకు చెందిన చిత్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈ చిత్రం లో కంటెంట్ పెద్దగా లేదు. నవీన్ పోలిశెట్టి అద్భుతమైన కామెడీ టైమింగ్ తో పాటు, ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ సినిమా అవలీలగా ఓపెనింగ్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. లేదంటే కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లోనే ఉండేదని అంటున్నారు విశ్లేషకులు. మరి విశ్లేషకుల అంచనా నిజం అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక పోతే ఈ ఓటీటీ వెర్షన్ లో ఎలాంటి అదనపు సన్నివేశాలను జత చేయడం లేదట. ఈ క్లారిటీ ని స్పష్టంగా ఇచ్చారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version