spot_img
Homeఎంటర్టైన్మెంట్Harish Shankar Tweet: 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ఇళయరాజా పాట..ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్..వైరల్...

Harish Shankar Tweet: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో ఇళయరాజా పాట..ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్..వైరల్ అవుతున్న హరీష్ శంకర్ ట్వీట్!

Harish Shankar Tweet: ‘ఓజీ’ లాంటి భారీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie). గబ్బర్ సింగ్ తర్వాత ఆయన హరీష్ శంకర్ తో రెండవ సారి చేతులు కలిపిన చిత్రమిదే. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి సరైన కమర్షియల్ సినిమా ఒక్కటి కూడా రాలేదు. అన్నీ సినిమాలు కంటెంట్ బేస్ తో వచ్చినవే. పవన్ కళ్యాణ్ అంటేనే ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ లేకుండా సీరియస్ జానర్ సినిమాలే చేస్తూ వచ్చాడు ఈమధ్య కాలంలో. అలాంటి పవర్ స్టార్ నుండి చాలా కాలం తర్వాత రాబోతున్న కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా కావడం, గబ్బర్ సింగ్ కాంబినేషన్ అవ్వడం వల్ల ఈ చిత్రం పై సాధారణంగానే మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాట కూడా సూపర్ హిట్ గా నిలిచి సినిమా హైప్ ని క్రియేట్ చేసింది.

ఇకపోతే త్వరలోనే రెండవ పాటని కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఫిబ్రవరి 15న శివరాత్రి సందర్భంగా ఈ పాట విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాసేపు పక్కన పెడితే రీసెంట్ గానే హరీష్ శంకర్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్టు ని అప్లోడ్ చేశాడు. అందులో ‘దేవుడి దర్శనం చేసుకొని, దేవిశ్రీప్రసాద్ వద్దకు వెళ్తున్నాం’ అని అంటాడు. ఆయన పక్కనే ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ కూడా ఉంటాడు, వెనుక ‘ఇళయరాజా ‘ పేరుతో ఒక గేట్ ఉంటుంది. దీన్ని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే హరీష్ శంకర్, చంద్ర బోస్ ఇద్దరూ ఇళయరాజా ని కలిశారు అనేది. ఈమధ్య కాలం లో ఇళయరాజా తన అనుమతి తీసుకోకుండా, తన పాటలను వాడుకునే వాళ్లపై కేసులు వేస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ లో కూడా ఇళయరాజా స్వరపరిచిన ‘సుందరి’ పాటని సినిమాలో అనేక సందర్భాల్లో ఉపయోగించుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమా మేకర్స్ మీద మాత్రం ఇళయ రాజా ఎలాంటి కేసు వెయ్యలేదు. కారణం ఆ మేకర్స్ ఇళయ రాజా నుండి అనుమతి ని తీసుకున్నారు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో ఇళయరాజా పాటని వాడుకొని ఉంటాడని , అందుకోసం ఆయన అనుమతి తీసుకున్నట్టు ఈ ఫోటోని చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది. మరి హరీష్ శంకర్ ఇళయ రాజా కు సంబంధించిన ఏ సినిమాలోని పాటని వాడుకున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version