Andhra Pradesh: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలు జిన్నా టవర్ పై తాజా వివాదం తీసుకొచ్చారు. దాన్ని కూల్చాల్సిందేనని చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా నిన్నటి నుంచి పెద్ద రగడ రాజేసింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దాన్ని కూల్చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు.దీంతో ప్రస్తుతం గుంటూరు నగరంలోని జిన్నా టవర్ రాజకీయ వివాద కేంద్రంగా మారిపోయింది. దీనిపై బీజేపీ నేతలు సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు చేస్తున్నారు.
గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్ ఈ నాటిది కాదు స్వాతంత్రానికి పూర్వమే ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇన్నాళ్లు లేని వివాదం ఇప్పుడే ఎందుకొచ్చింది. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారు. రాజకీయంగా ఏపీలో బలపడాలనే ఉద్దేశంతో బీజేపీ ఇటీవల కాలంలో జగన్ ను టార్గెట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహించింది.
Also Read: జిన్నా పేరు చిచ్చు.. జగన్ సర్కార్ పై బీజేపీ మరోపోరాటం
ఇందులో భాగంగానే ఏపీలో అధికారం చేజిక్కించుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగానే ప్రస్తుతం జిన్నా టవర్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడ ముస్లిం జనాభా కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే దీన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేయాలని చూస్తందని ఓ వాదన వినిపిస్తోంది. ఎప్పుడో నిర్మించిన దాన్ని కూల్చేయాలని వివాదం రేపడం అందరిలో విస్మయం కలిగిస్తోంది. ఇటీవల ఏపీలో చీప్ లిక్కర్ గురించి బీజేపీ అధ్యక్షుడు చేసిన కామెంట్లు అందరిలో ఆశ్చర్యం కలిగించాయి. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు జిన్నా టవర్ ను తెరమీదకు తెచ్చింది.
ఓటు బ్యాంకు కోసమే బీజేపీ జిన్నా టవర్ అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో ఓటర్లను ఆకట్టుకోవాలంటే ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తెచ్చుకోవాలనే తాపత్రయంలో భాగంగానే బీజేపీ దీన్ని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో కూడా ఆందోళన నెలకొంది. బీజేపీ సరైన దారిలోనే ఓటర్లను ఆకర్షించుకోవాలే కానీ ఇలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని ప్రజలను తప్పుదారి పట్టించొద్దనే సూచనలు చేస్తున్నారు.
Also Read: మోకాళ్లతో దేకినా జగన్ అమరావతి ఇవ్వడు.. అమరావతి రైతులతో ఆంధ్రజ్యోతి ఆర్కే హాట్ కామెంట్స్