కూర‘గాయాలే’: ఏం తినేటట్టు లేదు.. కొనేటట్టు లేదు

  భారీ వర్షాలతో పంటలు నాశనం అయ్యాయి. కూరగాయల పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో వాటికి తీవ్ర కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. మరోవైపు కొనేవారు లేక రైతులు పారబోస్తున్నారు. మార్కెట్లో మాత్రం కూరగాయలు అన్నీ కిలో రూ.50 దాటాయి. అధిక ధరలతో జనం అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఏపీ, తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. అమాంతం పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. వర్షాలు రాకముందు వరకు అందుబాటులో ఉన్న […]

Written By: NARESH, Updated On : July 28, 2021 10:10 am
Follow us on

 

భారీ వర్షాలతో పంటలు నాశనం అయ్యాయి. కూరగాయల పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో వాటికి తీవ్ర కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. మరోవైపు కొనేవారు లేక రైతులు పారబోస్తున్నారు. మార్కెట్లో మాత్రం కూరగాయలు అన్నీ కిలో రూ.50 దాటాయి. అధిక ధరలతో జనం అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది.

ఏపీ, తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. అమాంతం పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. వర్షాలు రాకముందు వరకు అందుబాటులో ఉన్న ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.

నిన్నా మొన్నటి వరకు రూ.10 ఉన్న టామాటా ధర ఇప్పుడు కిలో రూ.50 రూపాయలకు చేరింది. కిలో పచ్చి మిర్చి ఏకంగా రూ.60 పలుకుతోంది. బీరకాయ, కాకరకాయ, బెండకాయ ఇలా ఏదీ తీసుకున్నా 60 నుంచి 80 రూపాయల ధర పలుకుతోంది. అందరికీ అందుబాటులో ఉండే ఆకుకూరలు కూడా వర్షాలకు రాని పరిస్థితి నెలకొంది. పంటలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఆకుకూరలపై ఫంగస్, బ్యాక్టీరియాతో మచ్చలు ఏర్పడుతున్నాయి. తాజాగా లేకపోవడంతో జనాలు కొనక రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారు. ఫ్రెష్ గా ఉన్న ఆకుకూరల ధరలు భారీగా పలుకుతున్నాయి.

ఒక్కసారిగా చుక్కలనంటిన ధరలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వంద రూపాయలు తీసుకెళ్లినా రెండు కూరలు రావడం లేదని వాపోతున్నారు. పప్పులు, చారుతోనే కాలం గడిపేస్తున్నామని చెబుతున్నారు. వర్షాల ప్రభావంతో ఇంకో నెలరోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంటున్నారు.

పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుదల.. నిత్యావసరాల భగ్గుమనడంతో ఇప్పుడు సామాన్యుడి పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది.