ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. సంవత్సరానికి రూ.12 వేలు పొందే ఛాన్స్..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలను అందిస్తుండగా ఈ పాలసీలను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత కలుగుతుంది. ఈ పాలసీలో ఎంచుకునే ప్లాన్ ను బట్టి ప్రయోజనాలు మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పాలసీదారుల కొరకు ఎల్‌ఐసీ పెన్షన్ ప్లాన్స్ ను కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలలో సరల్ పెన్షన్ ప్లాన్ ఒకటి కాగా […]

Written By: Navya, Updated On : July 28, 2021 10:41 am
Follow us on

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలను అందిస్తుండగా ఈ పాలసీలను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత కలుగుతుంది. ఈ పాలసీలో ఎంచుకునే ప్లాన్ ను బట్టి ప్రయోజనాలు మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పాలసీదారుల కొరకు ఎల్‌ఐసీ పెన్షన్ ప్లాన్స్ ను కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలలో సరల్ పెన్షన్ ప్లాన్ ఒకటి కాగా ఈ పాలసీ తీసుకోవడం ద్వారా ఒకేసారి ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీని తీసుకున్న వాళ్లు 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత ప్రతి సంవత్సరం 12వేల రూపాయల పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో రెండు ఆప్షన్లు ఉండగా లైఫ్ యాన్యుటీ ఆప్షన్ ద్వారా పెట్టిన డబ్బులను వెనక్కు పొందవచ్చు.

తొలి ఆప్షన్ ద్వారా పాలసీదారుడు పెన్షన్ పొందే అవకాశం ఉండగా రెండో ఆప్షన్ ద్వారా నామినీ పాలసీ డబ్బులను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఎంచుకునే ఆప్షన్ ను బట్టి పెన్షన్ ను ప్రతి నెలా పొందాలో లేక ఏడాదికి పొందాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. రెండో ఆప్షన్ ద్వారా భార్య భర్తలిద్దరూ డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇద్దరూ మరణిస్తే నామినీ డబ్బులు పొందవచ్చు.

40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. చెల్లించే ప్రీమియం ఆధారంగా పొందే పెన్షన్ మొత్తంలో కూడా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ప్రాతిపదిక ఆధారంగా పొందే పెన్షన్ మొత్తంలో మార్పులు అయితే ఉంటాయని సమాచారం.