https://oktelugu.com/

ప్చ్.. ఎలా సురక్షితం అవుతుంది నాని ?

హీరో సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా రాబోతున్న సినిమా ‘తిమ్మరుసు’. శరణ్‌ కొప్పిశెట్టి అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు కష్టపడి నిర్మించిన ఈ సినిమా పై అంచనాలు క్రియేట్ చేయడానికి టీమ్ కిందామీదా పడుతుంది. ఎన్టీఆర్ తో ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు. అలాగే నానితో ఆడియో ఫంక్షన్ చేసి బాగా హడావిడి చేశారు. అయితే, ‘తిమ్మరుసు’ ప్రీ రిలీజ్‌ వేడుకలో నాని ఆసక్తికరంగా మాట్లాడాడు. ‘కరోనా సమయంలో […]

Written By:
  • admin
  • , Updated On : July 28, 2021 / 10:00 AM IST
    Follow us on

    హీరో సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా రాబోతున్న సినిమా ‘తిమ్మరుసు’. శరణ్‌ కొప్పిశెట్టి అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు కష్టపడి నిర్మించిన ఈ సినిమా పై అంచనాలు క్రియేట్ చేయడానికి టీమ్ కిందామీదా పడుతుంది. ఎన్టీఆర్ తో ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు. అలాగే నానితో ఆడియో ఫంక్షన్ చేసి బాగా హడావిడి చేశారు.

    అయితే, ‘తిమ్మరుసు’ ప్రీ రిలీజ్‌ వేడుకలో నాని ఆసక్తికరంగా మాట్లాడాడు. ‘కరోనా సమయంలో థియేటర్లను అన్నిటికంటే ముందే మూస్తారు. చివరకు అన్నిటికంటే చివర్లో తెరుస్తారు. అసలు థియేటర్స్‌ చాలా సురక్షితం. ఎందుకంటే.. ఒకరితో ఒకరం మాట్లాడుకోం.. మాస్క్‌లు వేసుకుని సినిమా చూస్తాం అంటూ చెప్పుకుకొచ్చాడు నాని.

    ఎంత హీరో అయితే మాత్రం.. వందల మంది ఒక చోట చేరి ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటూ చూసే సినిమా థియేటర్… ఎలా సురక్షితం అవుతుంది ? నిజమే థియేటర్‌ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. లక్షల మంది ఆధారపడి థియేటర్స్ వ్యవస్థ పై బతుకుతున్నారు. థియేటర్ల మూత వల్ల వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట కూడా వాస్తవమే.

    అంతమాత్రాన కరోనా సమయంలో థియేటర్స్ తెరిచి సాధారణ ప్రేక్షకులను కూడా ఇబ్బంది పడమంటారా ? సినిమాకి కోట్లు తీసుకునే నానికి కరోనా చిన్న విషయం కావొచ్చు, పారాసెటమాల్ టాబ్లెట్ కొనుక్కోవడానికి కూడా ఆలోచించే పేదవారికి కరోనా సమయంలో థియేటర్స్ అవసరం లేదని గ్రహిస్తే మంచిది.

    ఇక పనిలో పనిగా నాని మరో స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి, సినిమా టికెట్ రేట్లు కూడా పెంచాలట. మొత్తానికి నాని తన బిజినెస్ గురించి బాగా ఆలోచించుకుంటున్నాడు.